Lal Salaam : లాల్ సలామ్ షూటింగ్‌కి గుడ్ బై అంటున్న మొయ్దీన్ భాయ్.. అలియాస్ రజినీకాంత్!
కూతురు ఐశ్వర్యా దర్శకత్వంలో రజినీ నటిస్తున్న మూవీ లాల్ సలామ్. ఈ మూవీ నుంచి కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Rajinikanth completed his portion in Lal Salaam directed by Aishwarya Rajinikanth
Lal Salaam : సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కూతురు ఐశ్వర్యా (Aishwarya Rajinikanth) దాదాపు 6 ఏళ్ళ తరువాత మళ్ళీ డైరెక్టర్ గా బాధితులు తీసుకోని చేస్తున్న సినిమా ‘లాల్ సలామ్’. తమిళ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జీవిత రాజశేఖర్ కూడా చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ రీ ఎంట్రీ ఇస్తుంది. ఇక ఈ మూవీలో రజినీకాంత్ ‘మొయ్దీన్ భాయ్’గా ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
Vijay : పాదయాత్ర మొదలుపెట్టబోతున్న విజయ్.. తమిళనాట వైరల్ అవుతున్న న్యూస్..!
తాజాగా ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలోని రజినీ పాత్ర షూటింగ్ మొత్తం పూర్తి అయ్యిందట. దీంతో రజినీ ఈ మూవీ నుంచి బయటకి వచ్చేశాడు. కాగా ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) కూడా ఒక గెస్ట్ రోల్ తో ఈ సినిమాలో మెరవబోతున్నాడు. ఆయనకి సంబంధించిన షూటింగ్ ని కూడా ఇటీవల పూర్తి చేశారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.
Vijay : 11 ఏళ్ళ తరువాత మరోసారి శంకర్ దర్శకత్వంలో విజయ్.. ఈసారి రీమేక్..? ఒరిజినల్..?
SuperStar ? Signs Off in Style! The team rejoices ? as the shooting for #MoideenBhai‘s portion is wrapped! ?
? @rajinikanth
? @ash_rajinikanth
? @arrahman
? @TheVishnuVishal & @vikranth_offl
? @DOP_VishnuR
⚒️ @RamuThangraj
✂️?️ @BPravinBaaskar
?… pic.twitter.com/XsAdUKdOwP— Lyca Productions (@LycaProductions) July 12, 2023
ఇక రజినీ నటిస్తున్న జైలర్ సినిమా విషయానికి వస్తే.. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, నాగబాబు, సునీల్, రమ్యకృష్ణ.. తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆగష్టు 10న రిలీజ్ కి సిద్దమవుతుంది. అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన ‘నువు కావాలయ్యా’ సాంగ్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తుంది.