Rakesh Master : రాకేశ్ మాస్టర్ కంపోజ్ చేసిన సూపర్ హిట్ సినిమాలు..
రాకేశ్ మాస్టర్ దాదాపు 1500 చిత్రాలకు పైగా కోరియోగ్రఫీ చేశారు. టాలీవుడ్ లోని పలు సూపర్ హిట్ సినిమాలకు డాన్స్ కంపోజ్ చేశారు.

Rakesh Master dance choreography movie list in telugu
Rakesh Master : టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రఫర్ రాకేశ్ మాస్టర్ మరణవార్త అందర్నీ షాక్ కి గురి చేస్తుంది. ఆయన మరణ వార్త తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. కాగా రాకేశ్ మాస్టర్.. ముక్కురాజు మాస్టర్ వద్ద కొన్నాలు శిష్యరికం చేశారు. ఆ తరువాత ఆట, ఢీ వంటి డ్యాన్స్ షోలతో కెరీర్ లో ముందుకు వెళ్లారు. ఢీ షోతో మంచి గుర్తింపు సంపాదించుకొని సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. అలా టాలీవుడ్ లోని పలు సూపర్ హిట్ సినిమాలకు డాన్స్ కంపోజ్ చేశారు.
Rakesh Master : రాకేశ్ మాస్టర్ – శేఖర్ మాస్టర్ గొడవ ఏంటి..? అసలు వారిద్దరి మధ్య ఏమైంది..!
లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, చిరునవ్వు, అమ్మో పోలీసోళ్ళు వంటి సూపర్ హిట్ సినిమాలకు డాన్స్ కోరియోగ్రఫీ చేసి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. దాదాపు 1500 చిత్రాలకు పైగా కోరియోగ్రఫీ చేశారు. ఇక ఈయన దగ్గర ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్స్ గా కొనసాగుతున్న ఎంతోమంది రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేసినవారే. వారిలో జానీ మాస్టర్ (Jani Master), శేఖర్ మాస్టర్ (Sekhar) కూడా ఉన్నారు. అంతేకాదు వేణు, మణిచందన, ప్రభాస్, ప్రత్యూష వంటి స్టార్స్ డాన్స్ పాఠాలు కూడా నేర్పించారు.
Rakesh Master : ప్రభుదేవాతో రాకేశ్ మాస్టర్ గొడవ ఏంటో తెలుసా..? పబ్లిక్‌గా సవాల్ విసిరి!
కాగా రాకేశ్ మాస్టర్ బతకడం కష్టమని రెండు నెలలు క్రిందటే డాక్టర్లు చెప్పారట. రెండు నెల్లలు క్రిందట హనుమాన్ మూవీ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్న సమయంలో మాస్టర్‌కు వాంతులు, విరోచనాలు అవ్వడంతో హాస్పిటల్ కి తీసుకు వెళ్లగా డాక్టర్లు.. రాకేశ్ మాస్టర్ ఎక్కువ కాలంగా బ్రతకడం కష్టమని, జాగ్రత్తగా చూసుకోమని హెచ్చరించారట. ఇక ఈరోజు ఉదయం రక్త విరోచనాలు అవ్వడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో సాయంత్ర 5 గంటల సమయంలో మరణించారు.