Ram Charan : ఆగస్టు వరకు నో షూటింగ్స్ అంటున్న చరణ్.. ఏదైనా ఉపాసన డెలివరీ అయ్యాకే..

పెళ్లైన 10 ఏళ్లకి తల్లితండ్రులు కాబోతున్న చరణ్ -ఉపాసన జులైలో డెలివర్ కాబోతున్న బేబీ కోసం ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. చరణ్ ప్రజెంట్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీతో బిజీగా ఉన్నారు.

Ram Charan : ఆగస్టు వరకు నో షూటింగ్స్ అంటున్న చరణ్.. ఏదైనా ఉపాసన డెలివరీ అయ్యాకే..

Ram Charan gives break to shootings up to upasana delivery

Ram Charan :  రామ్ చరణ్ లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. ఇప్పటికే దాదాపు నెలరోజుల నుంచి షూట్స్ కి అటెండ్ అవ్వని చరణ్ ఆగస్ట్ వరకూ షూటింగ్ కి అటెండ్ అయ్యే ప్రసక్తేలేదని చెప్పేశారు. ఇప్పుడప్పుడే షూటింగ్ మాటే ఎత్తొద్దంటున్నారు. ఇప్పటికే నెలరోజుల నుంచి షూటింగ్స్ చెయ్యని చరణ్ మరో నెల రోజులు పైగానే బ్రేక్ కంటిన్యూ చెయ్యబోతున్నారు.

పెళ్లైన 10 ఏళ్లకి తల్లితండ్రులు కాబోతున్న చరణ్ -ఉపాసన జులైలో డెలివర్ కాబోతున్న బేబీ కోసం ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. చరణ్ ప్రజెంట్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీతో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు చరణ్. ఇప్పటికే మ్యాగ్జిమమ్ షూట్ కంప్లీట్ చేసిన టీమ్ క్లైమాక్స్ షూట్ పనిలో ఉంది. క్లైమాక్స్ తో పాటు చరణ్ కి సంబందించి కొన్ని సీన్స్ చెయ్యాల్సి ఉంది. ఆల్రెడీ నెలరోజుల నుంచి షూట్ వాయిదా పడి ఉంది. ప్రస్తుతం ఉపాసనతోనే ఉన్న చరణ్ డెలివరీ అయ్యే వరకూ షూటింగ్ కి అటెండ్ కానని క్లియర్ గా చెప్పేశారు.

Sitara : మరోసారి సారంగదరియా స్టెప్పులతో అదరగొట్టిన సితార.. మహేష్ కూతురా మజాకా..

ఇటీవల చరణ్, ఉపాసన శర్వానంద్ పెళ్లిలో, వరుణ్ తేజ్ నిశ్చితార్థంలో సందడి చేశారు. ఉపాసన డెలివరీ జులై లాస్ట్ వీక్ లో అని తెలుస్తోంది. డెలివరీ కోసం ఫారెన్ నుంచి డాక్టర్స్ టీమ్ వస్తారని ఉపాసన సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. అంతేకాదు లేటెస్ట్ గా పుట్టబోయే బేబీ కోసం చేత్తో చేసిన ఉయ్యాల కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఉపాసన తన పేరెంట్స్ దగ్గర ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత మాత్రం చిరంజీవి ఇంటికే వెళ్లి ఉంటామని ఇటీవల తెలిపింది. ఇలా ఉపాసన డెలివరీ అయ్యే వరకూ చరణ్ షూట్ కి వెళ్లడన్నది మాత్రం క్లియర్. దీంతో ఆగస్టు వరకు చరణ్ సినిమా పట్టాలెక్కదు. ఇలా అయితే సంక్రాంతికి రిలీజ్ కష్టమేమో అని అభిమానులు భావిస్తున్నారు. ఇక చరణ్ షూట్ కి బ్రేక్ ఇవ్వడంతో శంకర్ ఇండియన్ 2 సినిమాలో బిజీగా ఉన్నాడు. చరణ్ వచ్చే లోపు ఇండియన్ 2 పూర్తి చేయాలని చూస్తున్నారు శంకర్.