జానీమాస్టర్ కు వీడియో ద్వారా బర్త్ డే స్పెషల్ వెషెస్ చెప్పిన రామ్ చరణ్

డ్యాన్స్ డైరెక్టర్ జానీ మాస్టర్ తనదైన స్టెప్ లతో పాటలకు మరింత వన్నె తెచ్చాడు. గురువారం (జులై 2, 2020) ఆయన పుట్టిన రోజు సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీడియో ద్వారా స్పెషల్ వెషెస్ చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్ లో పలు హిట్ సాంగ్స్ వెండితెరపై ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.
‘హాయ్ జానీ… విషింగ్ యు ఏ వెరీ హ్యాపీ బర్త్ డే. మనం కలిసి చాలా రోజులైంది. లాక్ డౌన్ త్వరగా ముగిసి సెట్స్ లో కలిసి సాంగ్స్ చేయాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నా. మీరంతా సేఫ్ గా ఉండండి. నీ వైఫ్ ని అందరినీ అడిగానని చెప్పు. ఆల్ దిబెస్ట్. మరోసారి హ్యాపీ బర్త్ డే’ అని చరణ్ విష్ చేశారు.
ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ మరో కథానాయకుడు. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది.