Ram Charan-Upasana: ఫిన్‌లాండ్‌లో ఫన్నీ మూమెంట్స్.. వీడియో వైరల్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ విడుదలకి సిద్ధమవుతుండగా.. రేపో మాపో ప్రమోషన్లను కూడా మొదలు పెట్టాల్సి ఉంది.

Ram Charan-Upasana: ఫిన్‌లాండ్‌లో ఫన్నీ మూమెంట్స్.. వీడియో వైరల్

Ram Charan Upasana

Updated On : March 14, 2022 / 6:30 PM IST

Ram Charan-Upasana: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ విడుదలకి సిద్ధమవుతుండగా.. రేపో మాపో ప్రమోషన్లను కూడా మొదలు పెట్టాల్సి ఉంది. ఇది కాక తమిళ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో ఉంది. మరోవైపు తండ్రి చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ తర్వాత మరో రెండు సినిమాలు కూడా సెట్స్ మీదకి వెళ్ళబోతున్నాయి.

Ram Charan : ఫిన్లాండ్‌లో రామ్ చరణ్, ఉపాసన.. మంచులో ఆడుకుంటూ..

అయితే.. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మెగా తనయుడు ఇప్పుడు భార్య ఉపాసనతో కలిసి వెకేషన్ కు వెళ్ళాడు. ఈ మెగా జంట ఇప్పుడు ఫిన్ లాండ్ లో ఉన్నారు. రెండేళ్ల తర్వాత రామ్ చరణ్ తో వెకేషన్ కు వెళ్తున్నాను అంటూ ఉపాసన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఈ వెకేషన్ లోని ఈ భార్యాభర్తల ఫన్ మూమెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Ram Charan: చెర్రీ హై స్పీడ్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మెగా ట్రీట్!

ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ ను ఉపాసన ట్రాలీపై కూర్చొపెట్టి అటు ఇటూ తిప్పడం, అలాగే ఉపాసనను రామ్ చరణ్ తిప్పడం ఫన్నీగా ఉంది. ఎయిర్ పోర్ట్ లో మాత్రమే కాదు ఈ జంట ఫిన్ లాండ్ లో చేసిన మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఉపాసన మంచు తినడం, ఒక కుక్క పక్కన మంచులో రామ్ చరణ్ పడుకోవడం అన్నీ సరదాగా ఉన్నాయి. మొత్తంగా ఈ మూమెంట్స్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుండగా సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.