మా వాడు బాగా సెన్సిటివ్.. శిష్యుడికి వర్మ మద్దతు..

  • Published By: sekhar ,Published On : September 21, 2020 / 05:08 PM IST
మా వాడు బాగా సెన్సిటివ్.. శిష్యుడికి వర్మ మద్దతు..

Updated On : September 21, 2020 / 5:31 PM IST

#MeeToo RGV Supports: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న‌ ప్రముఖ దర్శక-నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌కు పలువురు బాలీవుడ్‌ నటులు మద్దుతగా నిలుస్తున్నారు. తాజాగా దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అనురాగ్‌ కశ్యప్‌కు మద్దతిచ్చారు.


అనురాగ్ కశ్యప్ అత్యంత ‘సున్నితమైన, భావోద్వేగానికి గురయ్యే వ్యక్తి’ (highly sensitive and emotional person) అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. అనురాగ్ కశ్యప్ ఎవరినీ బాధపెట్టడం తాను ఎప్పుడూ చూడలేదని, కనీసం వినలేదని కూడా ఆర్జీవీ అన్నారు.


ఈ మేరకు వర్మ ‘నాకు తెలిసిన అనురాగ్‌ కశ్యప్‌ చాలా సున్నితమైన, భావోద్వేగాలు కలిగిన వ్యక్తి. నాకు అతడు గత 20 ఏళ్లుగా తెలుసు. ఇన్నేళ్ల కాలంలో ఆయన ఎవరినీ బాధపెట్టడం గురించి నేను ఎప్పుడూ చూడలేదు, వినలేదు.. కనుక ప్రస్తుతం జరిగే దాని గురించి స్పష్టంగా చెప్పలేను’ అంటూ ట్వీట్‌ చేశారు. అలాగే అనురాగ్ మాజీ భార్య కల్కీ కూడా ఆయనకు మద్దతు తెలుపుతూ ఓ ప్రకటన చేశారు.