రాజమౌళికి రాము కౌంటర్.. మట్టిని ముట్టుకోవడం ఇష్టముండదట!

  • Published By: sekhar ,Published On : November 11, 2020 / 03:45 PM IST
రాజమౌళికి రాము కౌంటర్.. మట్టిని ముట్టుకోవడం ఇష్టముండదట!

Updated On : November 11, 2020 / 4:32 PM IST

RRR-Ram Gopal Varma: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్‌కు అపూర్వ స్పందన లభిస్తోంది. సినీ ప్రముఖులందరూ ఎంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ.. తమ తోటి వారిని కూడా మొక్కలు నాటమని ప్రోత్సహిస్తున్నారు.


ఈ నేపథ్యంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన RRR మూవీ టీమ్ అందరూ తమ వంతుగా మొక్కలు నాటారు. వి.వి.వినాయక్, రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్‌లను నామినేట్ చేశారు రాజమౌళి.



https://10tv.in/rakul-preet-and-nabha-natesh-participated-in-green-india-challenge/
అయితే తాను ఈ ఛాలెంజ్‌ను స్వీకరించనని వర్మ ట్వీట్ చేశారు. ‘రాజమౌళి సర్.. నేను గ్రీన్‌కు, ఛాలెంజ్‌లకు చాలా దూరం. మట్టిని ముట్టుకోవడం అంటే నాకు అసహ్యం. మొక్కలకు నాలాంటి స్వార్థపరుడి అవసరం లేదు. మీకు, మీ మొక్కలకు ఆల్ ది బెస్ట్’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు ఆర్జీవీ.
కాగా ఆర్ఆర్ఆర్ చిత్రబృందం.. ‘ఆచార్య’, ‘పుష్ప’, ‘రాధే శ్యామ్’ సినిమా సభ్యులంతా ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలనవలసిందిగా నామినేట్ చేశారు.
https://10tv.in/rrr-team-accepted-ram-charans-challenge-and-planted-saplings/