Ram Gopal Varma : వివేకా కేసులోని నిందితుడిని ‘వ్యూహం’ సినిమాలో వర్మ చూపించబోతున్నాడా..?
వర్మ తెరకెక్కిస్తున్న ‘వ్యూహం’ సినిమాలో వివేకా కేసులోని నిందుతుడిని చూపించబోతున్నాడా? వర్మ ఏమి సమాధానం చెప్పాడు..?

Ram Gopal Varma showcase Viveka Case Accused in Vyooham movie
Ram Gopal Varma : సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ‘వ్యూహం’ (Vyooham), ‘శపథం’ అనే చిత్రాలను ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాడు. ఈ రెండు సినిమాలను సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించబోతున్నాడు. 2024 ఏపీ ఎన్నికల లక్ష్యంగా వర్మ ఈ సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్ అండ్ టీజర్స్ చూసిన ఆడియన్స్.. ఈ సినిమాల్లో వర్మ ఏవేవి చూపించబోతున్నాడా అని ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటీ నెలకొంది.
Chiranjeevi : భోళా శంకర్ అయిపోయింది.. చిరు నెక్స్ట్ ఏంటి? బర్త్ డేకి ఆ దర్శకుడితో సినిమా అనౌన్స్?
ప్రస్తుతం ఈ మూవీలోని కీలక సన్నివేశాల షూటింగ్ విజయవాడలో జరుగుతోంది. షూటింగ్ గ్యాప్ లో వర్మ మీడియా ప్రతినిధులతో మాట్లాడి సినిమా విషయాలను తెలియజేశాడు. వ్యూహం, శపథం సినిమాలను 2024 ఏపీ ఎన్నికల కోసమే తీస్తున్నానని, అందులో ఎటువంటి సందేహం లేదని కుండ బద్దలు కొట్టేశాడు. జగన్ మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి తీసుకు రావాలో, లేక ప్రతిపక్షాలను దోషులుగా చూపించడానికో ఈ సినిమా తీయడం లేదన్నాడు. జగన్ విషయంలో తాను నమ్మిన నిజాన్ని, జగన్ లో తాను చూసిన రియాలిటీని చూపిస్తూనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
Jawan : షారుఖ్ జవాన్ సినిమా విషయంలో నమోదైన పోలీస్ కేసు.. ఎందుకో తెలుసా..?
ఇక గత ఎన్నికల సమయంలో కీలకంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసుని ఈ సినిమాలో చూపించబోతున్నారా అని ప్రశ్నించగా.. చూపిస్తున్నట్లు వర్మ పేర్కొన్నాడు. ఈ కేసులోని నిందితుడు ఎవరు అన్నది నిజ జీవితంలో ఇప్పటికి పెద్ద ప్రశ్నగా మిగిలి ఉండిపోయింది. సినిమాలో ఆ నిందితుడు ఎవరు అన్నది చూపించబోతున్నారా అని అడగగా, వర్మ బదులిస్తూ.. “ఆ కేసు గురించి అడిగితే పది మంది పది వెర్షన్లు చెబుతున్నారు. అలాగే నేను కూడా నా వెర్షన్ ని చూపించాను. ఇక నిందితుడు దొరికాడా, లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి” అంటూ బదులిచ్చాడు. మరి సీబీఐ (CBI) వాళ్ళు కూడా పట్టుకోలేని నిందితుడిని వర్మ చూపించబోతున్నాడా, లేదా చూడాలి. కాగా మొదటి భాగం వ్యూహం ఈ అక్టోబర్ లో, శపథం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతున్నట్లు చెప్పుకొచ్చాడు.