Vyooham Teaser : ‘వ్యూహం’ టీజర్ ముహూర్తం సెట్ చేసిన వర్మ..

వ్యూహం మూవీ టీజర్ కి రామ్ గోపాల్ వర్మ ముహూర్తం సెట్ చేశాడు.

Vyooham Teaser : ‘వ్యూహం’ టీజర్ ముహూర్తం సెట్ చేసిన వర్మ..

Ram Gopal Varma Vyooham teaser release date fix

Updated On : June 22, 2023 / 5:19 PM IST

Ram Gopal Varma Vyooham : రామ్ గోపాల్ వర్మ గత ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఎన్నికల సమయంలో ‘లక్మిస్ ఎన్టీఆర్’ సినిమా తీసి సంచలనం సృష్టించాడు. అప్పటిలో ఆ సినిమా సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇక ఈ ఎన్నికల సమయంలో.. ‘వ్యూహం’, ‘శపథం’ అనే చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ఈ సినిమాలు బయోపిక్ కాదు రియల్ పిక్ అంటూ అనౌన్స్ చేయడంతో ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

Bhola Shankar : మెగా టీజర్ కి డేట్ ఫిక్స్.. ఇక భోళాశంకరుడి జాతర షురూ..

గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న కొన్ని అంశాలను తీసుకోని ఈ సినిమాలను తెరకెక్కిస్తున్నట్లు వర్మ ప్రకటించాడు. ఇక ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టిన RGV శరవేగంగా షూటింగ్ జరుపుతున్నాడు. ఇప్పటికే మూవీలోని ముఖ్య పాత్రల పిక్స్ ని షేర్ చేసి సంచలనం సృష్టించాడు. తాజాగా ఈ మూవీ టీజర్ ని రెడీ చేశాడట. ఇటీవలే అమరావతిలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ని (YS Jagan Mohan Reddy) కలిసి ఇప్పటి వరకు పూర్తి అయిన సీన్స్ తో పాటు టీజర్ కట్ ని కూడా చూపించినట్లు తెలుస్తుంది.

Project K : ప్రాజెక్ట్ K టైటిల్‌ని రెడీ చేస్తున్న మేకర్స్.. అమెరికాలో టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్!

జగన్ తో దాదాపు గంటకు పైగా భేటీ అయిన వర్మ.. ఇప్పుడు ఫైనల్ కట్ టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేశాడు. ఈ శనివారం (జూన్ 24) ఉదయం 11 గంటలకు ఈ టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. మరి టీజర్ తో ఎటువంటి సంచనలం సృష్టిస్తాడో చూడాలి. కాగా ఈ సినిమాలో జగన్ పాత్రని ‘అజ్మల్ అమీర్’ పోషిస్తున్నాడు. వైఎస్ భారతి రోల్ లో మానస రాధా కృషన్ కనిపించబోతుంది. గతంలో వర్మతో వంగవీటి సినిమా తెరకెక్కించిన దాసరి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.