20ఇయర్స్ ఇండస్ట్రీ: రమణా లోడ్ ఎత్తాలిరా.. చెక్ పోస్ట్ పడతాది

20ఇయర్స్ ఇండస్ట్రీ: రమణా లోడ్ ఎత్తాలిరా.. చెక్ పోస్ట్ పడతాది

Updated On : January 20, 2020 / 3:54 AM IST

సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఒకటే డైలాగ్ ‘రమణ లోడ్ ఎత్తాలి రా.. చెక్ పోస్ట్ పడతాది’ అభిమానుల గుండెల్లో నిలిచిపోయిందంతే. ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ బయటకు రాని వ్యక్తి సక్సెస్ మీట్‌లో స్టేజి మీద మెరిసి తన గురించి చెప్తే గానీ, తెలియలేదు అతను 20ఇయర్స్ ఇండస్ట్రీ అని. ఇన్నేళ్లకు ఈ సినిమాతో అతని గురించి ప్రేక్షకులకు తెలిసిందని. 

పట్టువదలని విక్రమాధిత్యుడిలా పోరాడి ఇన్ని సంవత్సరాలకు ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన అసలు పేరు సేతురామన్ కుమానన్. సినిమా ఇండస్ట్రీ కంటే ముందు డైనోరా అనే ఎలక్ట్రానిక్ కంపెనీలో సర్వీస్ ఇంజినీర్ గా పనిచేశాడు. గతంలో సినిమాటోగ్రాఫర్‍‌గా, ఫొటోగ్రాఫర్‍‌గా, సెక్యూరిటీ చీఫ్‌గా, ఫ్యాషన్ మోడల్‌గా చేశాడు. ఇన్ని సంవత్సరాలు తర్వాత యాక్టర్ గా జనాలకు తెలిసింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kumanan Sethuraman (@kumanan_sethuraman) on

2004లో మేఘం అనే సినిమాతో వెండితెరపై కనిపించాడు. ఆ తర్వాత వెంకీ, స్టాలిన్, ధైర్యం సినిమాల్లో చిన్నచిన్న రోల్స్ చేశాడు. అరవింద్ 2సినిమాలో విలన్ పాత్ర పోషించాడు. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత అల్లుడు శీను సినిమాలో ప్రదీప్ రావత్‌కు గురువు పాత్రలో కనిపించారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Beauty attracts the EYE BUT Personality captures the HEART?❤️ #mensfashion #style #bestoftheday #swag #look #beard #picoftheday #summer #instamood Pc: @hemanth_kumanan

A post shared by Kumanan Sethuraman (@kumanan_sethuraman) on

ఈ గ్యాప్‌లో ఫొటో షూట్‌లలో ఫ్యాషన్ షోలు, డిజైన్డ్ డ్రెస్సింగ్ షోలలో మెరిశాడు. 60కి పై బడిన ఏజ్‌లో మెయింటైన్ చేస్తున్న ఫిజిక్‌కు నోరెళ్ల బెడుతున్నారు అభిమానులు. ఇన్నేళ్ల కృషికి తగ్గ ఫలితం వచ్చిందని ఆయనతో పాటు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్యాషన్‌తో పాటు పేషెన్స్ కూడా ఉండాలి. అప్పుడే సక్సెస్ ను రీచ్ అవగలమని నిరూపించాడు.