Hiranyakashyap : రానా ‘హిరణ్యకశ్యప’ కాన్సెప్ట్ టీజర్.. రాక్షస రాజు ఆగమనం.. అదిరిపోయింది
ఇటీవల రాణా కామిక్ కాన్ ఈవెంట్‌లో హిరణ్య కశ్యప ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తాజాగా ఈ చిత్ర కాన్సెప్ట్ టీజర్‌ని విడుదల చేశారు. కార్టూన్ రూపంలో హిరణ్య కశ్యపుడి ఫోటోల రూపంలో ఉన్న వీడియోను రాణా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Hiranyashyapa concept teaser
Hiranyakashyap concept teaser : అప్పట్లో రానా (Rana) హీరోగా గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో ‘హిరణ్య కశ్యప’ సినిమా వస్తుందని చెప్పారు. ఈ చిత్రం కోసం కొన్నాళ్ల పాటు గుణశేఖర్ కష్టపడ్డాడు. అయితే ఏమైందో తెలీదు గానీ ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ చిత్రం రావడం లేదంటూ వార్తలు వినిపించాయి. వాటిని నిజం చేస్తూ ఇటీవల రాణా కామిక్ కాన్ ఈవెంట్‌లో హిరణ్య కశ్యప ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ప్రముఖ కామిక్ స్టోరీలు ‘అమర్ చిత్ర కథ’ నుంచి తీసుకున్న కథతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా కథ రాస్తున్నట్టు తెలుస్తోంది. హిరణ్యకశ్యపుడి పౌరాణిక గాధని ఎంతో ఆసక్తికరంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర కాన్సెప్ట్ టీజర్‌ని విడుదల చేశారు. కార్టూన్ రూపంలో హిరణ్య కశ్యపుడి ఫోటోల రూపంలో ఉన్న వీడియోను రాణా సోషల్ మీడియాలో షేర్ చేశారు. హిరణ్య కశ్యపుడిగా రానా లుక్ ఎలా ఉండనుందో టీజర్‌ను చూస్తుంటే అర్థం అవుతోంది.
Sreeleela : శ్రీలీల స్టార్‌డమ్ మాములుగా లేదుగా.. అప్పుడే చీఫ్ గెస్ట్ రేంజ్‌కి వచ్చేసింది..
కఠోరమైన తపస్సును హిరణ్య కశ్యపుడు ఎందుకు చేశాడు అనే కోణంలో ఈ సినిమాని రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కాన్సెప్ట్ టీజర్ కి రానా ‘ రాక్షస రాజు ఆగమనం’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే మరిన్ని అప్‌డేట్‌లతో ఇవ్వనున్నట్లు రానా తెలిపారు.
View this post on Instagram
ఇదిలా ఉంటే.. ఈ సినిమా విషయమై రానా, గుణశేఖర్‌కు మధ్య వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. శాకుంతలం చిత్ర ప్రమోషన్స్ లో ‘హిరణ్య కశ్యప’ సినిమా గురించి గుణశేఖర్ మాట్లాడాడు. హిరణ్య కశ్యప’ సినిమా కథని రానా దగ్గరికి తీసుకెళ్ళాను. చేద్దాం అన్నాడు, తర్వాత ఏవో ఇబ్బందులు వచ్చి ఆ కథని పక్కన పెట్టారు. అదే కథని ఇప్పుడు వేరే వాళ్ళతో చేస్తున్నారు. నా కథనే చేస్తే మాత్రం నేను ఊరుకోను. ఒకవేళ అదే కథని వాళ్ళు ఇంకోలా చేసి, ఇంకోలా చూపిస్తే మాత్రం నాకు అనవసరం. నాకు అన్యాయం జరిగితే నేను ఊరుకోను అని అన్నారు. చూడాలి మరీ ఈ సినిమా కథ ఎలా ఉండనుందో.
Guntur Kaaram : గుంటూరు కారం మూవీకి మొదటి హీరో మహేష్ కాదట.. ఎన్టీఆర్ అంటా.. నిజమెంత..!