Ranbir Kapoor : రామాయణం పనులు మొదలుపెట్టిన రణ్‌బీర్.. విలువిద్యలు నేర్చుకుంటూ..

రణ్‌బీర్ కపూర్ తాను నటించబోయే రామాయణం పనులు మొదలుపెట్టేసారు. విలువిద్యలు నేర్చుకుంటూ..

Ranbir Kapoor : రామాయణం పనులు మొదలుపెట్టిన రణ్‌బీర్.. విలువిద్యలు నేర్చుకుంటూ..

Ranbir Kapoor starts his Ramayanam movie pre production works

Updated On : March 26, 2024 / 5:38 PM IST

Ranbir Kapoor : ఆదిపురుష్ తరువాత బాలీవుడ్ లో మరో రామాయణం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ రామాయణంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా కనిపించబోతున్నారట. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఇప్పటివరకు రాలేదు. కానీ ఈ సినిమాకి సంబంధించిన వర్క్స్ మాత్రం ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

తాజాగా వైరల్ అవుతున్న కొన్ని పిక్స్ చూస్తుంటే మాత్రం.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లోనే జరుగుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నెట్టింట కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్ లో రణ్‌బీర్‌తో పాటు బాణాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక అవి గమనించిన నెటిజెన్స్.. రణ్‌బీర్ విలువిద్యల్లో శిక్షణ తీసుకుంటున్నారని భవిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో బాలీవుడ్ రామాయణం న్యూస్ మరోసారి ట్రేండింగ్ లోకి వచ్చింది.

Also read : Vedhika : ఐపీఎల్ నిర్వాహుకులపై హీరోయిన్ సీరియస్.. హార్దిక్ పాండ్య బౌలింగ్ సమయంలో..

ఇక ఈ సినిమా కోసం రణ్‌బీర్ ఆల్రెడీ మద్యం, నాన్ వెజ్ తినడం కూడా మానేశారట. ఈ చిత్రాన్ని దంగల్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని డైరెక్ట్ చేసిన నితేశ్‌ తివారీ తెరకెక్కించబోతున్నారట. మొత్తం మూడు భాగాలుగా ఈ సినిమాని రూపొందించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ రామాయణంలో సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా కేజీఎఫ్ హీరో యశ్ నటించనున్నారని ముందు నుంచి వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి.

అలాగే హనుమంతుడిగా సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్‌ ప్రీత్‌ కనిపించబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ పాత్రలో ఎవరు కనిపిస్తారో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. కాగా ఈ సినిమాని ఈ ఏడాది సమ్మర్ లో గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారని సమాచారం.