Ranbir Kapoor : అల్లు అర్జున్, చరణ్, ఎన్టీఆర్‌ల నటన పై రణ్‌బీర్ వైరల్ కామెంట్స్..
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ తన కొత్త సినిమాని రిలీజ్ కి సిద్ధం చేశాడు. 'తు ఝూతి మై మక్కార్' అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్ లో రణ్‌బీర్ మాట్లాడుతూ టాలీవుడ్ హీరోల యాక్టింగ్ పై కామెంట్ చేశాడు.

Ranbir Kapoor viral comments on allu arjun ram charan and ntr acting
Ranbir Kapoor : బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ తన కొత్త సినిమాని రిలీజ్ కి సిద్ధం చేశాడు. ‘తు ఝూతి మై మక్కార్’ అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. లవ్ రంజన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. మర్చి 8న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే నిన్న (ఫిబ్రవరి 23) మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ ఈవెంట్ లో రణ్‌బీర్ మాట్లాడుతూ టాలీవుడ్ హీరోల యాక్టింగ్ పై కామెంట్ చేశాడు.
Ranbir Kapoor : దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి నేను అర్హుడిని కాదు.. రణ్‌బీర్!
గత రెండు సంవత్సరాల్లో వచ్చిన మూడు సినిమాలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. వాటిలో మొదటిది పుష్ప, తరువాత గంగూబాయి కతియావాడి అండ్ RRR.. ఈ మూడు చిత్రాలు నా పై చాలా ఇంపాక్ట్ చూపించాయి. ఈ మూడు చిత్రాల్లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ అండ్ అలియా యాక్టింగ్ నాలోని నటుడి పై చాలా ప్రభావితం చూపించింది. ఒక నటుడిగా నేను అలాంటి పాత్రలు చేయాలని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వీడియోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
కాగా రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న మరో న్యూ మూవీ ‘యానిమల్’. ఈ చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్నాడు. గ్యాంగ్ స్టార్ యాక్షన్ క్రైమ్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఆగష్టు 11న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పై టాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Actor #RanbirKapoor About Icon StAAr @alluarjun ❤#AlluArjun performance in #Pushpa impacted me a lot as an audience ?#PushpaTheRule #Pushpa #Pushpa2 pic.twitter.com/Ba7Gkn401n
— Rider ajay (@Riderajay2) February 22, 2023