Ranveer Singh : ఈ రచ్చ ఏందయ్యా.. వైరల్ అవుతున్న రణవీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్

తాజాగా మరోసారి రణవీర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఈ సారి ఏకంగా న్యూడ్ ఫొటోషూట్ ఇచ్చి అందర్నీ షాక్ కి గురిచేశారు. ఓ మ్యాగజైన్ కోసం రణవీర్ తాజాగా న్యూడ్ ఫొటోషూట్..........

Ranveer Singh :  ఈ రచ్చ ఏందయ్యా.. వైరల్ అవుతున్న రణవీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్

Ranveer Singh

Updated On : July 26, 2022 / 6:19 AM IST

Ranveer Singh :  స్టార్లు, సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు కొత్త ఫొటోషూట్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని మ్యాగజైన్స్ కి కూడా ఫొటోషూట్స్ ఇస్తుంటారు మన స్టార్లు, సెలబ్రిటీలు. బాలీవుడ్ లో వింత వింత ఫ్యాషన్స్ కి పెట్టింది పేరు రణవీర్ సింగ్. రకరకాల బట్టలు, కొత్త రకం డిజైన్స్ తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు రణవీర్ సింగ్. బాలీవుడ్ లో రణవీర్ సింగ్ ఫొటోషూట్స్ బాగా వైరల్ అవుతూ ఉంటాయి, అలాగే ట్రోల్స్ కూడా వస్తుంటాయి. అప్పుడప్పుడు ఆడవాళ్ళ బట్టలు, సగం సగం బట్టలు వేసుకొని ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు రణవీర్. సోషల్ మీడియాలో నెటిజన్లు వీటిని బాగా ట్రోల్ చేస్తుంటారు.

Prabhas : హైదరాబాద్ రోడ్లపై లగ్జరీ కార్లలో దూసుకుపోతున్న ప్రభాస్..

తాజాగా మరోసారి రణవీర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఈ సారి ఏకంగా న్యూడ్ ఫొటోషూట్ ఇచ్చి అందర్నీ షాక్ కి గురిచేశారు. ఓ మ్యాగజైన్ కోసం రణవీర్ తాజాగా న్యూడ్ ఫొటోషూట్ చేశాడు. అలాగే కేవలం కట్ డ్రాయర్ మీద కూడా ఫొటోలకి ఫోజులిచ్చాడు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక సోషల్ మీడియాలో ఈ ఫోటోల మీద భారీగా ట్రోలింగ్ జరుగుతుంది.

ఒకపక్కన ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేసినందుకు ఇవేం ఫొటోలురా బాబు, మాకు ఏంటి గతి, నువ్వేమన్నా అమ్మాయివా ఇలా బట్టలిప్పి చూపిస్తున్నావు, చేస్తే చేసావు ఇవి బయటకి ఎందుకు రిలీజ్ చేశావు.. అని సోషల్ మీడియాలో రణవీర్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరో పక్క కొంతమంది నెటిజన్లు స్టార్ హీరో అయి ఉండి ఇలా న్యూడ్ ఫొటోషూట్ చేయాలి అంటే చాలా గట్స్ ఉండాలి అని పొగిడేస్తున్నారు. రణవీర్ మాత్రం ఎప్పటిలాగే ఇవేమి పట్టించుకోకుండా తనపని తాను చేసుకుపోతున్నాడు.

View this post on Instagram

A post shared by Cinemaai News (@cinemaainews)