Regina Cassandra: అబ్బాయిలను మ్యాగీతో పోల్చిన రెజీనా.. వామ్మో.. ఏమిటా జోక్ అంటోన్న నెటిజన్లు!

టాలీవుడ్ బ్యూటీ రెజీనా కాసాండ్రా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ సినిమాలు కూడా వరుసబెట్టి చేస్తూ స్పీడుమీదుంది. ఇటీవల కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకే అమ్మడు ఓటేస్తుండటంతో ఆమె చేస్తున్న విలక్షణమైన పాత్రలు ఆమెకు మంచి పేరును తీసుకొస్తున్నాయి. మరో బ్యూటీ నివేథా థామస్‌తో కలిసి ‘శాకిని డాకిని’ అనే సినిమాలో రెజీనా ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉండటంతో ఈ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్.

Regina Cassandra: అబ్బాయిలను మ్యాగీతో పోల్చిన రెజీనా.. వామ్మో.. ఏమిటా జోక్ అంటోన్న నెటిజన్లు!

Regina Cassandra Adult Joke On Boys Goes Viral

Updated On : September 10, 2022 / 3:49 PM IST

Regina Cassandra: టాలీవుడ్ బ్యూటీ రెజీనా కాసాండ్రా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ సినిమాలు కూడా వరుసబెట్టి చేస్తూ స్పీడుమీదుంది. ఇటీవల కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకే అమ్మడు ఓటేస్తుండటంతో ఆమె చేస్తున్న విలక్షణమైన పాత్రలు ఆమెకు మంచి పేరును తీసుకొస్తున్నాయి. ఇక ఈ బ్యూటీ తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో బ్యూటీ నివేథా థామస్‌తో కలిసి ‘శాకిని డాకిని’ అనే సినిమాలో రెజీనా ముఖ్య పాత్రలో నటిస్తోంది.

Regina Cassandra : పెళ్లి చేసుకుంటానో లేదో తెలీదు.. నా ప్రేమ 2020 లోనే ముగిసిపోయింది

ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉండటంతో ఈ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. అయితే ఈ ప్రమోషన్స్‌లో భాగంగా రెజీనా ఓ ఇంటర్వ్యూలో తనలోని కామెడీ సెన్స్‌ను బయటపెట్టింది. కాగా, ఆమె పేల్చిన ఓ అడల్ట్ జోక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అబ్బాయిల గురించి తనకో జోక్ తెలుసని.. అబ్బాయిలు, మ్యాగీ రెండూ కేవలం 2 నిమిషాల్లోనే అయిపోతాయని రెజీనా చెప్పుకొచ్చింది.

Regina Cassandra: అందర్నీ ఇలాంటి ప్రశ్నలే అడుగుతారా అంటూ.. ప్రెస్‌మీట్ లో రిపోర్టర్స్ మీద ఫైర్ అయిన రెజీనా..

అయితే ఇది పూర్తిగా అడల్ట్ జోక్ కావడంతో కొందరు నెటిజన్లు రెజీనా కామెడీ సెన్స్‌కు ఫిదా అవుతున్నారు. కానీ, కొందరు మాత్రం ఈ రేంజ్‌లో అడల్ట్ జోక్స్ వేస్తే అభిమానులు ఇంకేమీ నేర్చుకుంటారు అని మండిపడుతున్నారు. ఏదేమైనా నెట్టింట మాత్రం రెజీనా పేల్చిన ఈ అడల్ట్ జోక్ వైరల్ అవుతోంది.