RGV : ప్రభాస్ ‘సలార్’ సినిమా ఆర్జీవీ ‘వ్యూహం’ని దెబ్బ తీస్తోందా? ‘సలార్’పై ఆర్జీవీ ఏమన్నాడు?

సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కాగా వారం రోజులకు డిసెంబర్ 29న డెవిల్, బబుల్ గమ్, ఆర్జీవీ వ్యూహం సినిమాలు రానున్నాయి.

RGV : ప్రభాస్ ‘సలార్’ సినిమా ఆర్జీవీ ‘వ్యూహం’ని దెబ్బ తీస్తోందా? ‘సలార్’పై ఆర్జీవీ ఏమన్నాడు?

RGV Comments on Prabhas Salaar Movie

Updated On : December 17, 2023 / 12:37 PM IST

RGV Comments on Salaar : ప్రభాస్(Prabhas) సలార్(Salaar) సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమా డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమాతో పెద్ద హిట్ కొడతాడని ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాకి టికెట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా? ఎప్పుడు బుకింగ్ చేసుకుందామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇక సలార్ సినిమాకి ప్రమోషన్స్ కూడా చేయట్లేదు. ఈ విషయంలో ప్రభాస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇక ప్రభాస్ సినిమాకి ఒక రోజు ముందే షారుఖ్ డంకీ సినిమా వచ్చి పోటీ ఇవ్వనుంది. సలార్ సినిమా రిలీజయిన వారం రోజులకు మాత్రం చాలా సినిమాలు రానున్నాయి.

Ayodhya Ram temple : అయోధ్య రామ మందిరం ప్రారంభానికి చిరంజీవి, అమితాబ్, రజనీలతో పాటు.. ప్రముఖులకు ఆహ్వానం

సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కాగా వారం రోజులకు డిసెంబర్ 29న డెవిల్, బబుల్ గమ్, ఆర్జీవీ వ్యూహం సినిమాలు రానున్నాయి. తాజాగా వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో ఆర్జీవీ సలార్ సినిమా గురించి మాట్లాడారు. ఓ మీడియా ప్రతినిధి వ్యూహంకి ముందు సలార్ సినిమా వస్తుంది దానివల్ల మీ సినిమాకు ఇబ్బంది ఉందా అని అడగగా ఆర్జీవీ మాట్లాడుతూ.. ఈ రెండు సినిమాలు వేరే జానర్స్. వ్యూహం పొలిటికల్ సినిమా, రియల్ గా జరిగిన స్టోరీ నుంచి తీసుకొని తీసింది. కాని సలార్ ఫిక్షనల్ స్టోరీ, పెద్ద స్టార్ ఉన్నాడు. ఈ రెండు వేరు. వ్యూహం సినిమా కేవలం పొలిటికల్ జోనర్ నచ్చే కొంతమంది ఆడియన్స్ కోసమే. అసలు ఈ రెండిటికి సంబంధమే లేదు అని అన్నారు. అయితే సలార్ పెద్ద హిట్ అయితే మాత్రం డిసెంబర్ 29న రిలీజ్ అయ్యే సినిమాలకు కచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందని భావిస్తున్నారు సినీ ట్రేడ్ వర్గాలు.