RGV – Rajamouli : నీకంటే తోపు ఉన్నాడు.. ఆర్జీవీ కి కాల్ చేసిన రాజమౌళి..

టాలీవుడ్ లో ఒకప్పుడు ఆర్జీవీ తన సినిమాలతో సెన్సేషన్ సృష్టించి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా హిట్స్ కొట్టారు. (RGV - Rajamouli)

RGV – Rajamouli : నీకంటే తోపు ఉన్నాడు.. ఆర్జీవీ కి కాల్ చేసిన రాజమౌళి..

RGV - Rajamouli

Updated On : November 12, 2025 / 1:27 PM IST

RGV – Rajamouli : సినీ పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వచ్చి సంచలనాలు సృష్టిస్తూనే ఉంటారు. ఒకర్ని మించి ఇంకొకరు అన్ని క్రాఫ్ట్స్ లోనూ వస్తూ ఉంటారు. మన టాలీవుడ్ లో ఒకప్పుడు ఆర్జీవీ తన సినిమాలతో సెన్సేషన్ సృష్టించి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా హిట్స్ కొట్టారు. ఆ తర్వాత రాజమౌళి తెలుగు స్థాయిని పెంచి హాలీవుడ్ వరకు తీసుకెళ్లారు. ఈ ఇద్దరూ డిఫరెంట్ దర్శకులు.(RGV – Rajamouli)

గతంలో రాజమౌళి ఆర్జీవితో మాట్లాడాలని చాలా ఎదురుచూసేవాడిని, ఆయన కనపడితే ఎలా మాట్లాడాలని ప్రిపేర్ అయ్యేవాడిని అని ఆర్జీవీ మీద తనకున్న అభిమానం గురించి పలుమార్లు చెప్పారు. ఆర్జీవీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయాలని కూడా ట్రై చేసానని రాజమౌళి స్వయంగా తెలిపారు గతంలో.

Also Read : RGV : బ్యాక్ టు బ్యాక్ రీ రిలీజ్ లు చేస్తున్న ఆర్జీవీ.. శివ తర్వాత ఏ సినిమానో తెలుసా? ట్రైలర్ కూడా రిలీజ్..

తాజాగా శివ సినిమా రీ రిలీజ్ సందర్భంగా నాగార్జున – ఆర్జీవీ – సందీప్ రెడ్డి వంగ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ.. గతంలో రాజమౌళి నాతో ఆర్జీవీ లాంటోడు ఎప్పుడో ఒకడు పుడతాడు. మళ్ళీ ఇప్పుడు సందీప్ పుట్టాడు అని అన్నాడు. కానీ యానిమల్ సినిమా చూసిన తర్వాత రాజమౌళి నాకు కాల్ చేసి సందీప్ ని నీతో పోల్చాను, ఆ మాటలు వెనక్కి తీసుకుంటాను. సందీప్ ఆర్జీవీ కా బాప్ నిన్ను మించి అని చెప్పినట్లు తెలిపాడు.

దీంతో ఆర్జీవీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. రాజమౌళినే సందీప్ రెడ్డి వంగని ఆ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చాడంటే మాములు విషయం కాదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు సందీప్. యానిమల్ సినిమాతో పాన్ ఇండియా వైడ్ ఫేమస్ అయ్యాడు. తన సినిమా టేకింగ్ స్టైల్ తో పాటు, తన బోల్డ్ మాటలు, యాటిట్యూడ్ తో సందీప్ మరింత వైరల్ అయ్యాడు. సందీప్ రెడ్డి వంగ శివ సినిమా చూసి ఎడిటింగ్ నేర్చుకున్నాను అని, ఆర్జీవికి వీరాభిమాని అని గతంలో పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.

Also Read : Shiva Child Artist : ‘శివ’ సైకిల్ ఛేజింగ్ సీన్ లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఏం చేస్తుంది? ఎక్కడ ఉంది? ఆర్జీవీకి థ్యాంక్స్ చెప్తూ పోస్ట్..