ఆర్ఆర్ఆర్ : గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కి నామినేట్ అయిన ‘RRR’..

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బిఫోర్ ఇండిపెండెన్స్ పిరియాడికల్ మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఇక ఈ సినిమాకు భారతీయ సినీ పరిశ్రమలోనే కాదు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ అశేషమైన ప్రేక్షకాదరణ పొందుతుంది. కేవలం అభిమానం మాత్రమే కాదు ఆంతర్జాతీయ అవార్డులను సైతం కైవసం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే...

ఆర్ఆర్ఆర్ : గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కి నామినేట్ అయిన ‘RRR’..

RRR Nominated for Golden Globe Awards

Updated On : December 13, 2022 / 7:02 AM IST

ఆర్ఆర్ఆర్ : దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బిఫోర్ ఇండిపెండెన్స్ పిరియాడికల్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. భారతీయ స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లను ఒక ధాటి పైకి తీసుకు వస్తూ ఒక ఇమాజినరీ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వచ్చి ఇమాజినేషన్ కి కూడా అందని రీతిలో సక్సెస్ ని అందుకొని తన సత్తా ఎటో చూపించాడు టాలీవుడ్ జక్కన్న.

M M Keeravani : ఎమ్ ఎమ్ కీరవాణికి ఇంటర్నేషనల్ అవార్డు..

ఇక ఈ సినిమాకు భారతీయ సినీ పరిశ్రమలోనే కాదు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ అశేషమైన ప్రేక్షకాదరణ పొందుతుంది. కేవలం అభిమానం మాత్రమే కాదు ఆంతర్జాతీయ అవార్డులను సైతం కైవసం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని గెలుచుకున్న ఈ చిత్రం. తాజాగా మరో ఘనతని అందుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కి RRR నామినేట్ అయ్యింది.

‘బెస్ట్ పిక్చర్ – నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరీలో ఆర్ఆర్ఆర్ నామినేషన్స్ లో నిలిచింది. ఈ అవార్డ్స్ కి నామినేట్ అవ్వడంతో.. RRR ఆస్కార్ నామినేషన్స్ కి మరింత చేరువైంది. మరి భారతీయ చిత్రం ఆస్కార్ కల ‘ఆర్ఆర్ఆర్’తో నెరవేరుతుందేమో చూడాలి. కాగా ఈ సినిమాలో హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు అద్భుతమైన నటన కనబరిచి అందరి అభినందనలు అందుకుంటున్నారు.