RRR: కొన్ని గంటల్లోనే ఆర్ఆర్ఆర్.. ప్లస్, మైనస్ అంశాలివే!
సౌత్ ఇండియాలోనే కాదు.. ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా రిలీజ్ అవుతున్న ట్రిపుల్ఆర్ కి రిలీజ్ టైమ్ దగ్గరపడింది. ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న ట్రిపుల్ఆర్ లాస్ట్ కి..

RRR
RRR: సౌత్ ఇండియాలోనే కాదు.. ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా రిలీజ్ అవుతున్న ట్రిపుల్ఆర్ కి రిలీజ్ టైమ్ దగ్గరపడింది. ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న ట్రిపుల్ఆర్ లాస్ట్ కి ఈ శుక్రవారం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆర్ఆర్ఆర్ వస్తుందని మిగతా సినిమాలేవీ రిలీజ్ లు పెట్టుకోలేదు. సోలోగా గ్రాండ్ గా ధియేటర్లోకొస్తున్న ఆర్ఆర్ఆర్ కి ఈ రిలీజ్ డేట్ అడ్వాటేజా..? డిసెంట్వాంటేజా..?ఈ శుక్రవారం రిలీజ్ అయితే ట్రిపుల్ఆర్ కలిసొచ్చే అంశాలేంటి..? దెబ్బేసే రీజన్సేంటి..? ట్రిపుల్ఆర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు మిగతా సినిమాల రికార్డుల్ని బ్రేక్ చేసి సరికొత్త రికార్డుల్ని సెట్ చేస్తుందా అని ఫాన్స్ వెయిట్ చేస్తుంటే.. ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకోవాలా..? ఎంతలా సినిమాని ఆడియన్స్ కి రీచ్ చేద్దామా అని సరికొత్త ప్లాన్లతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తున్నారు ట్రిపుల్ఆర్ టీమ్. మార్చి 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు కొన్ని కలిసొచ్చే అంశాలుంటే.. కొన్నికలెక్షన్లు డ్రాప్ అయ్యే ఛాన్సులున్నాయి.
RRR: టార్గెట్ 2 వేల కోట్లు.. ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా ట్రిపుల్ఆర్?
రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు రాబోతోంది ట్రిపుల్ఆర్. చాలా సార్లు పోస్ట్ పోన్ అయ్యి మార్చి 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం ఫాన్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ టైమ్ ఆరఆఱ్ ఆర్ కి కలిసొచ్చే ఎలిమెంట్. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన సినిమాలు మంచి హిట్ అవ్వడంతో పాటు, పెద్ద సినిమాలేవీ ట్రిపుల్ఆర్ కు అడ్డు లేకపోవడం సోలోగా కలెక్షన్లు సంపాదించడానికి బాగా కలిసొచ్చే అంశం. ట్రిపుల్ కున్న మరో బలం.. ట్రిపుల్ఆఱ్ స్టార్ కాస్టే. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి బాలీవుడ్ నంచి ఆలియా, అజయ్ దేవ్ గన్ లాంటి స్టార్ యాక్టర్స్ తో పాటు.. హాలీవుడ్ నుంచి కూడా యాక్ట్ చెయ్యడంతో సినిమా రీచింగ్ ఈజీ అయ్యింది.
RRR: ఆర్ఆర్ఆర్ షూటింగ్ జర్నీ.. బాప్ రే అనాల్సిందే!
ఎన్టీఆర్, రామ్ చరణ్ లీడ్ రోల్స్ లో రాజమౌళి డైరెక్షన్లో రిలీజ్ కు రెడీ అవుతున్న ట్రిపుల్ఆర్ ప్రమోషన్లు సినిమాకు బాగా కలిసొచ్చే అంశం. సౌత్ టూ నార్త్, జైపూర్ టూ కాశీ నాన్ స్టాప్ గా ప్రమోషన్లు చేస్తున్నారు టీమ్. ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ కు 10 రోజులముందునుంచే ఈ సినిమా టీమ్ చేసే సందడి చేస్తోంది. టోటల్ మార్కెటింగ్ తో పాటు ఇంటర్వ్యూలు, ఈవెంట్లు, షోలు ఇలా ఒక్కటేమిటి అన్నిరకాలుగా నేషన్ వైడ్ గా ప్రమోషన్లు చేస్తున్న ట్రిపుల్ఆర్ ఆడియన్స్ లో సినిమా మీద హైప్స్ క్రియేట్ చేసింది.
RRR : కన్నడ నాట ‘ఆర్ఆర్ఆర్’కి దెబ్బ మీద దెబ్బ
ట్రిపుల్ఆర్ కి కలిసొచ్చే మరో అంశం.. ఇప్పుడప్పుడే ఎగ్జామ్స్ లేకపోవడం. జనరల్ గా అయితే మార్చి ఎండింగ్ లో ఎగ్జామ్స్ ప్రిపరేషన్, ఎగ్జామ్స్ మూడ్ తో ఉంటారు అటు పిల్లలతో పాటుఫ్యామిలీస్. సో.. మార్చిలో పెద్దగా స్టార్ మూవీస్ ఏవీ రిలీజ్ పెట్టుకోరు. కానీ ఈ సంవత్సరం కోవిడ్ వల్ల ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వడం.. బోర్డ్ ఎగ్జామ్స్ ఏవీ లేకపోవడం.. ట్రిపుల్ఆర్ రిలీజ్ కు కలిసొచ్చే ఎలిమెంట్. అంతేకాదు.. ఏపీలో టిక్కెట్ రేట్స్ పెంచడం, బెనిఫిట్ షోస్, ఎక్స్ ట్రా షోస్ కి కూడా పర్మిషన్ ఇవ్వడంతో.. ట్రిపుల్ఆర్ కి మేజర్ రిలీఫ్ వచ్చినట్టే.
RRR: అక్కడ ఆర్ఆర్ఆర్ బ్యాన్ చేయాలని డిమాండ్..?
మరో వైపు.. కలెక్షన్లు డ్రాప్ అవ్వడానికి కూడా అదే రేంజ్ లో మైనస్ లు కనిపిస్తున్నాయి. 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ట్రిపుల్ఆర్ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే.. అంతకన్నా ముందే మార్చి 24న భీమ్లా నాయక్ అచ్చతెలుగు ఓటీటీ యాప్ ఆహాలో రిలీజ్ అవుతోంది. ధియేటర్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిన భీమ్లాకి ఓటీటీలో ఇక అడ్డే ఉండదు. సో..భీమ్లా దెబ్బకి ట్రిపుల్ఆర్ అబ్బా అనాల్సిందే. ఇప్పటికే ధియేటర్ రిలీజ్ కి చేసినంత ప్రమోషన్లు చేస్తూ.. ఇంకా సినిమా మీద హైప్ తెస్తున్నారు ఆహా టీమ్.
RRR: ట్రిపుల్ఆర్ నెవర్ బిఫోర్ ప్రమోషన్స్.. కుంభస్థలాన్ని కొట్టేస్తారా?
ట్రిపుల్ఆఱ్ పాన్ ఇండియా మూవీ కావడంతో బాలీవుడ్ మార్కెట్ మీద కూడా కాన్సన్ ట్రేట్ చేసింది. అయితే ఆల్రెడీ 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి కశ్మీర్ ఫైల్స్.. ఇప్పటికే 200 కోట్ల కలెక్షన్లు దాటి రోజు రోజుకీ కలెక్షన్లతో పాటు ధియేటర్లు కూడా పెంచుకుంటూ పోతోంది. రిలీజ్ అయ్యింది బాలీవుడ్ లో అయినా ఇండియా మొత్తం తిరుగుతూ ప్రెస్ మీట్స్ పెట్టి సినిమా ని ప్రమోట్ చెయ్యడమే కాకుండా మిగతా లాంగ్వేజెస్ లోకి డబ్ చేసి సినిమాని మరోసారి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు టీమ్. సో..అన్ డౌటెడ్ లీ కశ్మీర్ ఫైల్స్ కలెక్షన్లు ట్రిపుల్ఆర్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ కనిపిస్తోంది. అంతేకాదు టిక్కెట్ బుకింగ్స్ యాప్స్ లో కూడా ట్రిపుల్ఆర్ మీద నార్త్ జనాలు పెద్దగా ఇంట్రస్ట్ చూపించకపోవడం బాలీవుడ్ లో ట్రిపుల్ఆర్ కి దెబ్బ పడే ఛాన్సే.
RRR: తారక్ వాడిన బుల్లెట్‌కు అంత ఖర్చా..?
ట్రిపుల్ఆర్ సౌత్ లో తెలుగులో తర్వాత తమిళ్ లో ఎక్కువ క్రేజ్ ఉంది. అయితే మార్చి 25నే ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవ్వడం తో పాటు.. అదే రోజు వలిమై ఓటీటీ లరిలీజ్ అవుతోంది. జీ యాప్ లో ఈ బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ రిలీజ్ కూడా ట్రిపుల్ఆర్ కు కలిసి రాని అంశం అని అన్ డౌటెడ్ గా చెప్పొచ్చు. ఇక ట్రిపుల్ఆర్ కి సంబందించి ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మార్చి 23 నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 8 వరకూ కంటిన్యూ అవ్వబోతున్నాయి. వీటితో పాటు బోర్డ్ ఎగ్జామ్స్ కి సంబందించి ప్రీ ఫైనల్స్ కూడా స్టార్ట్ అవుతుందడంతో యూత్ వచ్చే చాన్స్ కాస్త తగ్గినట్టే. ఇక బెన్ ఫిట్ షోస్, ప్రీమియర్స్ ఎంత కలిసొచ్చే అంశమో..అంత మైనస్ కూడా. ఇప్పటికే బెనిఫిట్ షో టిక్కెట్స్ 5 వేలకు మించి ఉండడం, కామన్ ఫాన్స్ కి అందుబాటులో లేకపోవడంతో ఫాన్స్ ఇప్పటికే డిసప్పాయింట్ అవుతున్నారు. ఇలా ఒక వైపు ట్రిపుల్ ఆఱ్ రిలీజ్ కు కలిసొచ్చే అంశాలెన్నున్నాయో.. కలెక్షన్లకు కలిసిరాని ఎలిమెంట్స్ కూడా అన్నే ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా అల్టిమేట్ గా ఆడియన్స్ రెస్పాన్స్ కోసం వెయిట్ చెయ్యాల్సిందే.