అనుకున్నదే అయ్యింది.. సంక్రాంతికి ‘RRR’
#RRR విడుదల తేది గురించి క్లారిటీ ఇచ్చిన దర్శకధీరుడు రాజమౌళి.. సంక్రాంతికి పాన్ ఇండియా లెవల్‌లో గ్రాండ్ రిలీజ్..

#RRR విడుదల తేది గురించి క్లారిటీ ఇచ్చిన దర్శకధీరుడు రాజమౌళి.. సంక్రాంతికి పాన్ ఇండియా లెవల్‌లో గ్రాండ్ రిలీజ్..
‘బాహుబలి : ది బిగినింగ్’, ‘బాహుబలి : ది కన్‌క్లూజన్’ సినిమాలతో యావత్ ప్రపంచం చూపు తెలుగు సినిమా వైపు తిప్పాడు దర్శకధీరుడు రాజమౌళి. తెలుగు సినిమాని పాన్ ఇండియా లెవల్‌కి తీసుకెళ్లి, మన సినిమా స్థాయిని పెంచడమే కాక తెలుగు సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుని, గౌరవాన్ని తీసుకొచ్చాడు.
రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘#RRR’.. ఈ సినిమా విడుదల తేదీపై గతకొద్ది రోజులుగా పలు వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి 8న సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మొదట ఈ ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు.
‘ప్రేక్షకులకు ఇది కొంత డిజప్పాయింట్మెంట్ అయినప్పటికీ, వారికి మరింత బెస్ట్‌గా మా సినిమాని అందించాలనే ఉద్దేశ్యంతో సినిమాని 2021 జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నాం’ అని ఆర్ఆర్ఆర్ యూనిట్ తమ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు.
కానీ సినిమాని పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్న నేపథ్యంలో అనుకున్న తేదీలో విడుదల అసాధ్యమైంది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపబోతున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని సుమారు 300 కోట్ల రూపాయలతో డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు.
Your love and support have made all our hard work and hectic schedules worthwhile! We are working round the clock to give you a cinematic experience like never before. And with a huge worldwide release planned, we have had to postpone the date of release.
— RRR Movie (@RRRMovie) February 5, 2020
We understand this is a disappointment, but there’s going to be a lot to look forward to because this only gives us more time to bring the best to you.
— RRR Movie (@RRRMovie) February 5, 2020