Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి విడాకుల వార్తలు.. జనసేన రియాక్షన్ ట్వీట్..

పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లెజ్నెవాతో విడాకులు తీసుకోబోతున్నాడంటూ నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిలో నిజమెంత..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి విడాకుల వార్తలు.. జనసేన రియాక్షన్ ట్వీట్..

Rumours about Pawan Kalyan divorce with his wife Anna Lezhneva

Updated On : July 5, 2023 / 7:17 PM IST

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు, అటు రాజకీయం చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. మూవీ అండ్ పొలిటికల్ న్యూస్ తో డైలీ వార్తల్లో నిలిచే పవన్ గురించి ఇప్పుడు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. దాని సారాంశం ఏంటంటే పవన్ తన మూడో భార్య అన్నా లెజ్నెవా (Anna Lezhneva) తో విడాకులు తీసుకోబోతున్నాడట. ఈ విషయాన్ని ఒక నేషనల్ మీడియా రాసుకొచ్చింది. గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీ జరుగుతున్న ముఖ్యమైన ఈవెంట్స్ లో ఎక్కడా అన్నా కనిపించకపోవడమే ఈ వార్తలకు కారణమనేలా ఆర్టికల్స్ వస్తున్నాయి.

Bro Movie : పవన్ కళ్యాణ్ ‘బ్రో’ మూవీ అప్డేట్.. ఆస్ట్రియాలో షూటింగ్!

ప్రస్తుతం పవన్ అండ్ అన్నా విడివిడిగా ఉంటున్నారని, అన్నా పిల్లలతో కలిసి రష్యాలో ఉంటున్నట్లు రాసుకొస్తున్నారు. కాగా పవన్ గతంలో నందిని మరియు రేణు దేశాయ్‌లతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఏఈ విషయం పై పవన్ రాజకీయంగా ఎంతో విమర్శిస్తుంటారు. దీంతో ఇప్పుడు ఈ విడాకుల వార్త హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని పవన్ అభిమానులు, జనసైనికులు కొట్టిపడేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జనసేనాని పై జరుగుతున్న కుట్ర ఇదంతా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Bro Theatrical Business :‘బ్రో’ థియేట్రికల్ బిజినెస్.. అక్ష‌రాల వంద కోట్లు..!

ఇక జనసేన పార్టీ కూడా ఈ వార్తలకు చెక్ పెడుతూ ఒక ట్వీట్ చేసింది. “జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో మంగళగిరి చేరుకుంటారు” అంటూ ట్వీట్ చేసింది. దీంతో విడాకులు రూమర్స్ అని తేలిపోయాయి.