Sai Dharam Tej : నిలకడగా సాయిధరమ్ తేజ్‌ ఆరోగ్యం…హెల్త్ బులిటెన్ విడుదల

సాయిధరమ్ తేజ్‌ హెల్త్ బులిటెన్‌ను అపోలో వైద్యులు శుక్రవారం విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అన్ని అవయవాలు సరిగానే పని చేస్తున్నాయని చెప్పారు.

Sai Dharam Tej : నిలకడగా సాయిధరమ్ తేజ్‌ ఆరోగ్యం…హెల్త్ బులిటెన్ విడుదల

Saidharam Tej Health

Updated On : September 11, 2021 / 11:30 AM IST

Sai dharam Tej Health Bulletin : సాయిధరమ్ తేజ్‌ హెల్త్ బులిటెన్‌ను అపోలో వైద్యులు శుక్రవారం (సెప్టెంబర్ 11,2021) విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అన్ని అవయవాలు సరిగానే పని చేస్తున్నాయని చెప్పారు. క్లోజ్ అబ్జర్వేషన్ కోసం ఈ రోజు కూడా ఐసీయూలోనే సాయి ధరమ్‌తేజ్‌ను ఉంచుతామన్నారు. రేపు మరొకసారి హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని వైద్యులు హెల్త్‌ బులిటెన్‌లో తెలిపారు. ఈ రోజు సాయిధరమ్‌తేజ్‌కు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. రేపు మరోసారి అపోలో వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ రిలీజ్‌ చేయనున్నారు.

ఇటు అపోలోకు వీఐపీలు క్యూ కడుతున్నారు. రామ్‌చరణ్‌, ఉపాసన ఉదయాన్నే అపోలోకు వచ్చారు. ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, రాశీకన్నాతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు అపోలోకు చేరుకున్నారు. చిరంజీవి, సురేఖ, నాగబాబు, అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌లు నిన్న రాత్రి అంతా అక్కడే ఉన్నారు. మరికొందరు సినీ ప్రముఖులు కూడా సాయిధరమ్‌తేజ్‌ కోలుకోవాలని ట్వీట్‌ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్‌ తేజ్‌ను నటులు ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌ పరామర్శించారు. వైద్యులను అడిగి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. తేజ్‌ ఒక ఫైటర్‌ అని.. త్వరగానే కోలుకుంటాడన్నారు.

Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు : మెగాస్టార్ చిరంజీవి

సాయిధరమ్‌తేజ్‌కు బైక్‌ రైడింగ్‌ అంటే చాలా ఇష్టం. రెగ్యులర్‌గా రేసింగ్‌లకు వెళతాడు. షూటింగ్‌లకు కూడా బైక్‌పై వెళ్లడానికే ఎక్కువగా ఇష్టపడతాడు. సాయిధరమ్‌ తేజ్‌ దగ్గర నాలుగు ఖరీదైన స్పోర్ట్స్‌ బైక్‌లు ఉన్నాయి. అందులో 2గిఫ్ట్‌గా వచ్చినవే. మేనమామ పవన్‌కల్యాణ్‌ ఓ అవెంజర్‌బైక్‌ను కానుకగా ఇచ్చారు. తేజ్‌ తల్లి హార్లీడేవిడ్‌సన్‌ బైక్‌ను గిప్ట్‌గా ఇచ్చారు. మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఓ బైక్‌ను సాయికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాదానికి గురైన బైక్‌ను తేజ్‌ తనే కొన్నాడు. రెగ్యులర్‌గా ఐటీసీ కోహినూర్‌ వెనక తేజ్‌ రైడింగ్‌కు వెళ్లేవాడని తెలుస్తోంది. ప్రతిసారి హెల్మెట్‌తో పాటు బైక్‌సూట్‌, నీ ప్యాడ్స్‌ ఎప్పుడూ ధరించేవాడు.

Sai Dharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం.. యాక్సిడెంట్ దృశ్యాలు విడుదల

నటుడు సందీప్‌ కిషన్‌, వైవా హర్ష, నరేశ్‌ కుమారుడు అంతా కలసి రైడింగ్‌కు వెళ్లేవారని తెలుస్తోంది. అలాగే రెగ్యులర్‌గా వీకెండ్‌ పార్టీలకు సాయి ధరమ్‌తేజ్‌ అటెండ్‌ అయ్యేవాడని చెబుతున్నారు. నిన్నకూడా వీకెండ్ కావడంతో ఓ పార్టీకి వెళ్లడానికే బయలుదేరినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే నిన్న ఒక్క హెల్మెట్‌ మాత్రమే ధరించి బైక్‌పై బయలుదేరాడు. అయితే వేగం, రోడ్డుపై మట్టి కారణంగా ప్రమాదం జరిగింది. ఒకవేళ బైక్‌ సూట్‌ వేసుకుని ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదని చెబుతున్నారు.