Sai Pallavi: కన్నడపై కన్నేసిన తమిళ బ్యూటీ..!

సాయి పల్లవి ఇప్పుడు తెలుగులో వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Sai Pallavi: కన్నడపై కన్నేసిన తమిళ బ్యూటీ..!

Sai Pallavi

Updated On : August 18, 2021 / 7:45 PM IST

Sai Pallavi: సాయి పల్లవి ఇప్పుడు తెలుగులో వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. రానా హీరోగా తెరకెక్కిన విరాటపర్వం ఇప్పటికే అన్నీ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉండగా.. నాగచైతన్య జంటగా తెరకెక్కిన శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సెప్టెంబర్ 10న విడుదల కానుంది. ఇక నానీ శ్యామ్ సింగరాయ్ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

తెలుగు సినిమాలు కాకుండా సాయిపల్లవి మరో రెండు తమిళ సినిమాలను కూడా లైన్లో పెట్టింది. ఇప్పటికే మలయాళంలో కూడా ఈ చిన్నదానికి ఫుల్ డిమాండ్ ఉంది. సౌత్ లో మిగిలింది శాండల్ వుడ్ ఒక్కటే కావడంతో సాయిపల్లవి టార్గెట్ ఇప్పుడు కన్నడపై పడ్డట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే నేష‌న‌ల్ అవార్డు విన్నింగ్ క‌న్న‌డ డైరెక్ట‌ర్ మ‌న్సోర్ తో కథా చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

మ‌న్సోర్ ఓ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉండగా.. అందులో సినిమాకు ప్రాణం లాంటి ఓ కీ రోల్ ఉందట. దీని కోసం సాయిపల్లవిని సంప్రదించినట్లు తెలుస్తుంది. మ‌న్సోర్ చెప్పిన క‌థ‌కు ఒకే చెప్పిన సాయిప‌ల్ల‌వి.. స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తిచేసి మరోసారి చర్చించాలని కండిషన్ పెట్టిందట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులను శరవేగంగా చేస్తున్న మన్సోర్ ఈ సినిమాను దక్షణాది అన్ని బాషలలో తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడట. ఇక, ఈ సినిమా పట్టాలెక్కినట్లయితే సాయిపల్లవి దక్షణాది అన్ని భాషల్లో స్టార్ గా మారుతుందేమో!