Saindhav : ‘సైంధవ్‌’తో మరో సినిమాటిక్ యూనివర్స్‌ని క్రియేట్ చేస్తున్నా.. డైరెక్టర్ శైలేష్‌ కొలను..

‘సైంధవ్‌’తో డైరెక్టర్ శైలేష్‌ కొలను మరో సినిమాటిక్ యూనివర్స్‌ని క్రియేట్ చేస్తున్నాడట. 'చంద్రప్రస్థ' అనే సిటీ ని క్రియేట్ చేసి..

Saindhav : ‘సైంధవ్‌’తో మరో సినిమాటిక్ యూనివర్స్‌ని క్రియేట్ చేస్తున్నా.. డైరెక్టర్ శైలేష్‌ కొలను..

Sailesh Kolanu announces his 2nd Cinematic Universe from Venkatesh Saindhav

Updated On : October 17, 2023 / 2:21 PM IST

Saindhav : ‘హిట్’ చిత్రంతో ఒక క్రైమ్ థిల్లర్ సినిమా యూనివర్స్ ని క్రియేట్ చేసిన శైలేష్ కొలను.. ఇప్పుడు వెంకటేష్ తో ‘సైంధవ్‌’ అనే యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నాడు. వెంకటేశ్ 75వ సినిమాగా ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రాబోతుంది. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశారు. అయితే ఈ సినిమాకి, హిట్ మూవీ యూనివర్స్ కి ఏమన్నా కనెక్షన్ ఉంటుందా..? అనే సందేహం అందరిలో నెలకుంది. ఇక ఈ విషయాన్ని శైలేష్ కొలనుని ప్రశ్నించగా.. ఆడియన్స్ కి ఒక క్లారిటీ ఇచ్చేశాడు.

హిట్ మూవీ యూనివర్స్ తో సైంధవ్‌‌కి ఏ కనెక్షన్ లేదని తెలియజేశాడు. అయితే సైంధవ్‌ తో మాత్రం మరో సినిమాటిక్ యూనివర్స్‌ని క్రియేట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ‘చంద్రప్రస్థ’ అనే సిటీ ని క్రియేట్ చేసి, ఆ సిటీనే ఒక పాత్రగా చేసుకొని, దాని చుట్టూ పలు సినిమాల్లో తెరకెక్కించనున్నాడట. ఈ చంద్రప్రస్థ యూనివర్స్ ని సైంధవ్‌‌తో మొదలు పెట్టబోతున్నాడు. సైంధవ్‌‌ సినిమాలో ఈ చంద్రప్రస్థ సిటీ చుట్టే స్క్రీన్ ప్లే సాగనుందని తెలుస్తుంది. ఈ సిటీ క్రైమ్ వరల్డ్ బేస్ క్యాంపు అయ్యుంటుందని శైలేష్‌ కొలను మాటల్లో తెలుస్తుంది.

Also read : Roja Selvamani : మహేష్ బాబు పక్కన ఆ పాత్రలు చేయాలని ఉంది..

ఇక నిన్న టీజర్ తో ఒక హై ఫీల్ అయిన అభిమానులు, ఇప్పుడు ఈ చంద్రప్రస్థ యూనివర్స్ వార్తతో మరింత హై ఫీల్ అవుతున్నారు. కాగా సైంధవ్‌‌ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ, తమిళ్ నటుడు ఆర్య, జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా.. తదితరులు నటిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నాడు. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.