Salman Khan : ప్రొడ్యూసర్స్ ఫిక్స్ చేసేశారు..
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ల కాంబోలో క్రేజీ ఫిలిం..

Puri Salman
Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఈ క్రేజీ కాంబోలో సినిమా రాబోతుందంటూ పలు సార్లు వార్తలు వచ్చాయి కానీ అఫీషియల్‌గా కన్ఫమ్ చెయ్యలేదు. ఇంతకుముందు బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో ‘బుడ్డా హోగా తేరే బాప్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు పూరి.
Kondaveeti Simham : ఇండస్ట్రీ రికార్డ్.. 40 ఏళ్ల ‘కొండవీటి సింహం’
ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘లైగర్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. తర్వాత నందమూరి బాలకృష్ణతో ఓ మూవీ చెయ్యబోతున్నాడు. అయితే ఇంతలో మరో హిందీ చెయ్యబోతున్నాడని, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.
SPIRIT : ‘స్పిరిట్’ అంటే అర్థం ఇదేనంట..!
వరుసగా క్రేజీ కాంబినేషన్లతో, ఊహకందని విధంగా సినిమాలు లైనప్ చేస్తున్న మైత్రీ సంస్థ పూరి – సల్మాన్‌లను లాక్ చేసినట్లు సమాచారం. హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్ చెయ్యబోతున్నారని.. పాన్ ఇండియా స్థాయి ప్రేక్షకులను అలరించేలా పూరి తన స్టైల్లో మంచి కథ రెడీ చేసే పనిలో ఉన్నారని అంటున్నారు.
Balakrishna : టైసన్ కోసం బాలయ్య..!