Arpita Khan : సల్మాన్ సోదరి ఇంట్లో చోరీ.. 5 లక్షలు విలువ చేసే ఆభరణాలు మాయం..
తాజాగా సల్మాన్ ఖాన్ సోదరి, నటి అర్పిత ఖాన్(Arpita Khan) ఇంట్లో చోరీ జరిగింది. ముంబై(Mumbai) ఖర్ ఏరియాలో అర్పిత ఖాన్ తన భర్త, పిల్లలతో నివసిస్తుంది. మే 16న తన ఇంట్లో 5 లక్షల విలువ చేసే చెవి ఆభరణాలు పోయాయని గ్రహించి అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Salman Khan sister Arpita Khan house robbery happening and gold missed
Salman Khan : ఇటీవల సినీ సెలబ్రిటీల ఇళ్లల్లో వరుస చోరీలు జరుగుతున్నాయి. సెలబ్రిటీల ఇళ్లల్లో పనిచేసేవాళ్ళే డబ్బులు(Money) లేదా బంగారు(Gold) ఆభరణాలు కొట్టేసి మాయమైపోతున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ సోదరి, నటి అర్పిత ఖాన్(Arpita Khan) ఇంట్లో చోరీ జరిగింది. ముంబై(Mumbai) ఖర్ ఏరియాలో అర్పిత ఖాన్ తన భర్త, పిల్లలతో నివసిస్తుంది. మే 16న తన ఇంట్లో 5 లక్షల విలువ చేసే చెవి ఆభరణాలు పోయాయని గ్రహించి అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అర్పిత ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి వాళ్ళ ఇంట్లోనే పని చేస్తున్న సందీప్ హెగ్డే అనే వ్యక్తి వాటిని దొంగిలించినట్లు అనుమానించి అతని ఇంటిని సోదా చేయగా 5 లక్షల విలువైన చెవి ఆభరణాలు దొరికాయి. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
Pawan kalyan : పవన్ బ్యాక్ టు షూట్.. హైదరాబాద్ లో OG సెకండ్ షెడ్యూల్ షూట్..
సందీప్ హగ్దే గత నాలుగు నెలలుగా అర్పిత ఇంట్లో పనిచేస్తున్నాడు. చెవి ఆభరణాలు దొంగలించిన అనంతరం ఎవరికీ చెప్పకుండా పని మానేసి వెళ్లిపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆ కోణంలో దర్యాప్తు చేపట్టగా అతని ఇంట్లో ఆ ఆభరణాలు దొరికాయి. వాటిని అర్పితకు అప్పగించి, అతన్ని దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు.