అవును వెబ్ సిరీస్ చేస్తున్నాను.. క్లారిటీ ఇచ్చిన సామ్!
‘ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్టు సమంత అక్కినేని ప్రకటించింది..

‘ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్టు సమంత అక్కినేని ప్రకటించింది..
సమంత అక్కినేని.. వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ విజయపథంలో దూసుకెళ్తుంది. గతకొద్ది రోజులుగా సమంత వెబ్ సిరీస్‌లో నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో `ఫ్యామిలీ మేన్-2` వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ అరంగేట్రం చేయబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది సామ్.
మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి, నీరజ్, శరద్ కేల్కర్ కీలక పాత్రలు పోషించిన `ఫ్యామిలీ మేన్` తొలి సీజన్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా `ఫ్యామిలీ మేన్-2` తెరకెక్కబోతోంది. ఈ సిరీస్ రెండో సీజన్‌లో సమంత కీలక పాత్ర పోషించబోతోందని రాజ్ నిడమోరు, కృష్ణ డీకే వెల్లడించారు.
ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. `ది ఫ్యామిలీ మేన్-2`.. అత్యంత ఆదరణ పొందిన సిరీస్ ద్వారా డిజిటల్ అరంగేట్రం చేయబోతున్నాను. డ్రీమ్ రోల్ నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు` అని సమంత పోస్ట్ చేసింది. ఈ వెబ్‌సిరీస్‌లో సమంత నెగిటివ్ రోల్‌లో కనిపించబోతున్నట్టు సమాచారం. సమంత నటించిన ‘ఓ బేబి’ ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది.