Maa Inti Bangaram: అనుకున్నదే అయ్యింది.. సమంత ‘మా ఇంటి బంగారం’ వాయిదా
సమంత ప్రధాన పాత్రలో వస్తున్న 'మా ఇంటి బంగారం(Maa Inti Bangaram)' మూవీ వాయిదా పడింది.
samantha maa inti bangaram movie postponed
- సమంత ‘మా ఇంటి బంగారం’ వాయిదా.
- జూన్ 19న సినిమా విడుదల.
- ఐపీఎల్ వల్లే ఈ నిర్ణయం.
Maa Inti Bangaram: సౌత్ స్టార్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం(Maa Inti Bangaram)’. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సమంత తన సొంత బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో ఆమె ఒక గృహిణి పాత్రలో కనిపిస్తూనే, అదిరిపోయే యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించినట్లు టీజర్ ద్వారా స్పష్టమైంది. దాంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి.
నిజానికి ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేయాలని మేకర్స్ తొలుత భావించారు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో, వసూళ్లపై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో చిత్ర బృందం విడుదలను వాయిదా వేసింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వాయిదాతో సామ్ అభిమానులు ‘మా ఇంటి బంగారం’ సినిమా కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
