Samyuktha Menon : సంయుక్త మీనన్ బర్త్ డే స్పెషల్.. మూవీ అప్డేట్స్ అదిరిపోయాయి..

నేడు సంయుక్త పుట్టినరోజు కావడంతో తను నటిస్తున్న చిత్రాల నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేశారు.

Samyuktha Menon : సంయుక్త మీనన్ బర్త్ డే స్పెషల్.. మూవీ అప్డేట్స్ అదిరిపోయాయి..

Samyuktha Menon first looks from Swayambhu Devil

Updated On : September 11, 2023 / 9:03 PM IST

Samyuktha Menon : మలయాళ భామ సంయుక్త మీనన్.. బీమ్లా నాయక్ మూవీతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత బింబిసారా, సార్, విరూపాక్ష చిత్రాలతో వరుస హిట్టులు అందుకొని లక్కీ హీరోయిన్ గా ముద్ర వేసుకుంది. ప్రస్తుతం ఇప్పుడు రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది. వాటిలో ఒకటి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ (Devil), మరొకటి నిఖిల్ ‘స్వయంభు’ (Swayambhu). నేడు సంయుక్త పుట్టినరోజు కావడంతో ఈ రెండు చిత్రాల నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేశారు.

SJ Suryah : మహేష్ బాబుకి నేను బాకీ ఉన్నా.. ఎప్పటికైనా ఆ బాకీ తీర్చేస్తా..

డెవిల్ సినిమాలో సంయుక్త ‘నిషధ’ అనే పాత్రలో కనిపించనుంది. ఇక ఈ ఫస్ట్ లుక్ లో సంయుక్త.. చీర కట్టులో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. కొత్త దర్శకుడు నవీన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 24న రిలీజ్ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది.

Rajinikanth : మలేషియా ప్రైమ్ మినిస్టర్‌తో రజినీకాంత్.. శివాజీ స్టైల్‌లో గ్రీటింగ్..

ఇక నిఖిల్ ‘స్వయంభు’ విషయానికి వస్తే.. సోషియో ఫాంటసీ నేపథ్యంతో తెరకెక్కుస్తుంది. నిఖిల్ వారియర్ గా కనిపించబోతున్నాడు. ఈ మూవీ నుంచి నిఖిల్ లుక్ ని ఆల్రెడీ రిలీజ్ చేయగా.. నేడు సంయుక్త లుక్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ లుక్ ని ఒక శిల్పం రూపంలో రిలీజ్ చేశారు. ఆకాశం నుంచి కిందకి వచ్చి శిలగా మారిపోయిన దేవకన్య లాంటి సంయుక్త లుక్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. భరత్ కృష్ణమాచారి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.