Raakaasaa : నిహారిక నిర్మాత‌గా రెండో సినిమా.. ఆక‌ట్టుకుంటున్న ‘రాకాస’ గ్లింప్స్‌

యంగ్ హీరో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో న‌టిస్తున్న చిత్రం రాకాస గ్లింప్స్ (Raakaasaa) ను విడుద‌ల చేశారు.

Raakaasaa : నిహారిక నిర్మాత‌గా రెండో సినిమా.. ఆక‌ట్టుకుంటున్న ‘రాకాస’ గ్లింప్స్‌

Sangeet Shobhan Raakaasaa Glimpse out now

Updated On : January 23, 2026 / 7:19 PM IST

Raakaasaa : యంగ్ హీరో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో న‌టిస్తున్న చిత్రం రాకాస‌. మాన‌స శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై నిహారిక కొణిదెల‌, ఉమేష్ కుమార్ బ‌న్సాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి రాజు ఎదురోలు సినిమాటోగ్ర‌ఫీగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

నయన్ సారిక క‌థానాయిక‌. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Anasuya Bharadwaj : జిమ్‌లో అన‌సూయ హాట్ ఫోటోలు..

ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర గ్లింప్స్ విడుద‌ల చేశారు. ‘యుగయుగాలుగా ప్రతీ కథలో ఒక సమస్య, ఆ సమస్యను ఛేదించడానికి ఓ వీరుడు పుడతాడు. ఆ వీరుడు ఎవరో అని తెలిసేలోపే నిశ్శబ్దంగా పని ముగిస్తాడు. ఈ కథలో ఆ వీరుడు నేనే.’ అని సంగీత్ శోభన్ చెప్పే డైలాగ్‌తో గ్లింప్స్ ప్రారంభ‌మైంది. ఆ త‌రువాత త‌న కామెడీతో ఆక‌ట్టుకున్నాడు. మొత్తంగా గ్లింప్స్ అదిరిపోయింది.