Arabia Kadali : ‘అరేబియా కడలి’ రివ్యూ.. తండేల్ కథతో వెబ్ సిరీస్.. మరింత డీటెయిల్ గా, రియాల్టీగా..
తండేల్ పూర్తిగా కమర్షియల్ కోణంలో, నాగ చైతన్య చుట్టూ హీరో ఎలివేషన్స్ తో కథ జరిగేలా తెరకెక్కించారు. కానీ అరేబియా కడలి మాత్రం రియాల్టీగా, కథలో అనేక పాయింట్స్ టచ్ చేస్తూ తెరకెక్కించారు.

Arabia Kadali
Arabia Kadali Web Series Review : సత్యదేవ్, ఆనంది మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘అరేబియా కడలి’. డైరెక్టర్ క్రిష్, చింతకింది శ్రీనివాసరావు రచయితలుగా సూర్య కుమార్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, క్రిష్ నిర్మాణంలో ఈ సిరీస్ తెరకెక్కింది. అరేబియా కడలి వెబ్ సిరీస్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నేడు ఆగస్టు 8 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
కథ విషయానికొస్తే.. సముద్రపు ఒడ్డున ఉన్న చేపల వాడ, మత్స్య వాడ అనే ఊర్ల నుంచి మత్స్యకారులు ఇక్కడ ఆదాయం లేకపోవడంతో గుజరాత్ వెళ్లి అక్కడ కంపెనీలకు అరేబియా సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టి ఇచ్చి సంపాదించుకొని వస్తూ ఉంటారు. ఆ రెండు ఊర్లకు పాత పగలు ఉండటంతో ఒక ఊరి మనుషులు అంటే ఒక ఊరికి పడదు. వేరు వేరు ఊళ్లకు చెందిన బద్రి(సత్యదేవ్)- గంగ(ఆనంద్) ప్రేమించుకుంటారు. గంగ నాన్నకు బద్రి అంటే ఇష్టం ఉండదు. గంగ బావ శేఖర్ ఆమెని పెళ్లి చేసుకుందామని ట్రై చేస్తూ ఉంటాడు. గంగ తమ్ముడు కొంతమంది కుర్రాళ్లతో కలిసి డబ్బుల కోసం సముద్రం షిప్స్ లో దొంగతనాలు చేస్తూ ఉంటాడు.
ఎప్పట్లాగే రెండు ఊళ్లకు చెందిన కొంతమంది మత్స్యకారులు గుజరాత్ కి బయలుదేరుతారు. ఇందులో బద్రితో పాటు గంగ తండ్రి నానాజీ కూడా ఉంటారు. దారిలో వీళ్ళు గొడవపడి లేట్ గా వెళ్లడంతో అక్కడ వీళ్లకు మిగిలిన పాత బోట్స్ ఇచ్చి సముద్రంలోకి పంపుతారు. సముద్రంలో ఓ రెండు వారాలు చేపల వేట చేసి అనుకోకుండా తుఫాను రావడంతో పాకిస్థాన్ సముద్ర జలాల్లోకి వెళ్లడంతో పాకిస్థాన్ నేవి పట్టుకుంటారు. దీంతో అందరూ పాకిస్థాన్ జైలు లో ఇరుక్కుంటారు. మరి పాకిస్థాన్ జైలు లో ఇరుక్కున్న మత్స్యకారులు ఇండియాకు ఎలా తిరిగొస్తారు? గంగ – బద్రి పెళ్లి జరుగుతుందా? నానాజీకి బద్రి మీద కోపం పోతుందా? పాకిస్థాన్ జైల్లో మత్స్యకారులు పడ్డ కష్టాలు ఏంటి? వీళ్ళు బయటకు రావడానికి గంగ్ చేసిన పోరాటం ఏంటి? ఆ ఊళ్లకు జెట్టి వచ్చిందా? గంగ తమ్ముడి కథేంటి.. ఇవన్నీ తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
Also Read : Bakasura Restaurant : ‘బకాసుర రెస్టారెంట్’ మూవీ రివ్యూ.. తిండిపోతు దయ్యంతో హారర్ కామెడీ..
సిరీస్ విశ్లేషణ.. గతంలో ఇదే కథతో నాగచైతన్య తండేల్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మన మత్స్యకారులు గుజరాత్ దగ్గర వేటకు వెళ్లి పాకిస్థాన్ సముద్రంలోకి వెళ్లి అక్కడ పెట్టుబడి పాకిస్థాన్ నుంచి ఎలా ఇండియాకు వచ్చారు అని అదే కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కింది. అయితే తండేల్ పూర్తిగా కమర్షియల్ కోణంలో, నాగ చైతన్య చుట్టూ హీరో ఎలివేషన్స్ తో కథ జరిగేలా తెరకెక్కించారు. కానీ అరేబియా కడలి మాత్రం రియాల్టీగా, కథలో అనేక పాయింట్స్ టచ్ చేస్తూ తెరకెక్కించారు. తండేల్ , అరేబియా కడలి మూల కథ ఒకటైనా కథాంశంలో చాలా తేడాలు ఉండటమే కాక అనేక సీన్స్ కొత్తగా సిరీస్ లో జోడించారు. రెండు వేరు వేరు ఊళ్లు, ఆ ఊళ్ళ గొడవలు, హీరో – హీరోయిన్ వేరువేరు ఊళ్లకు చెందిన వాళ్ళు కావడం, హీరోయిన్ తమ్ముడు కథ, హీరోయిన్ బావ పాత్ర, హీరో పాకిస్థాన్ లో ఓ పాపని కాపాడటం, ఊళ్ళో పెద్ద మనిషి మోసం చేయడం.. ఇలా సిరీస్ లో తండేల్ తో పోలిస్తే కొత్తగా చాలానే ఉన్నాయి.
అయితే సిరీస్ కావడంతో కాస్త సాగదీత ఉంటుంది అక్కడక్కడా. మత్స్యకారులు పాకిస్థాన్ నేవికి చిక్కుకున్న దగ్గర్నుంచి ఆసక్తిగా మారుతుంది. లవ్ ఎమోషన్ తో పాటు మత్స్యకారుల ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. తండేల్ తర్వాత రిలీజయింది కాబట్టి దాంతో కంపేర్ చేస్తారు కానీ దాని కంటే ఈ సిరీస్ డీటెయిల్ గా, రియాల్టిగా తెరకెక్కించారు. అరేబియా సముద్రంలో తప్పిపోయి పాకిస్థాన్ కి వెళ్లారు కాబట్టి అరేబియా కడలి అనే టైటిల్ బాగానే సెట్ అయ్యేలా పెట్టారు. కాకపోతే ఢిల్లీ, పాకిస్థాన్, గుజరాత్ లో జరిగే కథలో అందరూ హిందీలో మాట్లాడటం గమనార్హం. తెలుగు ప్రేక్షకుల సౌకర్యం కోసమైనా తెలుగు డైలాగ్స్ పెట్టలేదు. హీరో కూడా ఏకబిగిన హిందీ మాట్లాడేయడం ఆశ్చర్యం. సీన్ చూసి ఎమోషన్ అర్ధం చేసుకున్నా తెలుగు ప్రేక్షకులకు అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియడం కష కష్టమే.
నటీనటుల పర్ఫార్మెన్స్.. సత్యదేవ్ మత్స్యకారుడిగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఆనంది పల్లెటూరులో చదువుకున్న అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఒకప్పటి హీరోయిన్ పూనమ్ బజ్వా పాకిస్థాన్ లో డాక్టర్ పాత్రలో కనిపించి అలరించింది. నాజర్, కోట జయరాం, రోషన్, రవి వర్మ, అమిత్ తివారి, వంశీ కృష్ణ.. ఇలా మిగిలిన నటీనటులంతా వారి పాత్రల్లో మెప్పించారు.
Also Read : Su From So : ‘సు ఫ్రం సో’ మూవీ రివ్యూ.. కామెడీ హారర్.. ఫుల్ గా నవ్వుకోవాల్సిందే..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇచ్చారు. లొకేషన్స్ కూడా చాలా వరకు రియాల్టీగా చూపించారు. కథలో అనేక కొత్త పాయింట్స్ చూపిస్తూ తండేల్ కి దీనికి డిఫరెన్స్ చూపించడానికి దర్శక రచయితలు బాగా కష్టపడ్డారు. నిర్మాణ పరంగా ఎక్కువే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.
మొత్తంగా ‘అరేబియా కడలి’ సిరీస్ ఏపీకి చెందిన మత్స్యకారులు పాకిస్థాన్ లో చిక్కుకుంటే ఎలా ఇండియాకు తిరిగొచ్చారు అని ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఈ సిరీస్ కి 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సిరీస్ రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.