Polimera 2 : విరూపాక్ష విజయం ఆ సీక్వెల్‌కి కలిసొచ్చింది.. పొలిమేర-2 రిలీజ్ పై ఇంత క్రేజా?
సత్యం రాజేష్ నటించిన 'మా ఊరి పొలిమేర' సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. విరూపాక్ష విజయంతో ఇప్పుడు ఈ సీక్వెల్ పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Satyam Rajesh Polimera 2 got huge attention from audience after Virupaksha hit
Polimera 2 : సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటించిన విరూపాక్ష (Virupaksha) సినిమా ఎంతటి హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. మిస్టిక్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం చేతబడి కథాంశంతో తెరకెక్కింది. థియేటర్ లో అందర్నీ భయపెట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ.. అటువంటి కథాంశాల సినిమాల పై ఆడియన్స్ లో ఆసక్తి కలిగేలా చేసింది. అయితే అటువంటి స్టోరీ లైన్ తో గతంలోనే ఒక సినిమా రిలీజ్ అయ్యింది. టాలీవుడ్ కమెడియన్ సత్యం రాజేష్ (Satyam Rajesh) మెయిన్ లీడ్ చేస్తూ తెరకెక్కిన సినిమా ‘మా ఊరి పొలిమేర’.
PKSDT : పవన్ అండ్ సాయి ధరమ్ టైటిల్ అదేనట.. ట్విట్టర్‌లో టైటిల్ వైరల్!
2021 లో ఓటిటి ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాలో కామాక్షీ భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఆ మూవీ ఎండింగ్ లోనే సెకండ్ పార్ట్ ఉంటుంది అంటూ చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సీక్వెల్ నుంచి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో క్షుద్ర పూజలు చేస్తున్న సత్యం రాజేష్ ని వెనక నుంచి చూపించారు. ఈ పోస్టర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఫస్ట్ పార్ట్ చూడని వారు కూడా విరూపాక్ష సినిమా వలన పొలిమేర 2 పై ఆసక్తిని చూపిస్తున్నారు.
Kushi : విజయ్ దేవరకొండ బర్త్ డే గిఫ్ట్.. ఖుషీ ఫస్ట్ సాంగ్ రిలీజ్!
ఇక ఫస్ట్ పార్ట్ ని డైరెక్ట్ చేసిన అనిల్ విశ్వనాథ్.. ఈ సీక్వెల్ ని కూడా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో అక్షత, సాహితి దాసరి, రాకేందు మౌళి, రవి వర్మ, చిత్రం శ్రీను తదితరులు ప్రధాన పత్రాలు పోషిస్తున్నట్లు తెలియజేశారు. శ్రీకృష్ణ క్రియేషన్స్ పతాకం పై గౌరికృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేస్తామంటూ చిత్ర యూనిట్ తెలియజేసింది. ఈ సీక్వెల్ ని థియేటర్ లోనే రిలీజ్ చేయనున్నారు.