Rakesh Master : రాకేశ్ మాస్టర్ పార్థివదేహానికి శేఖర్ మాస్టర్ నివాళులు.. కన్నీళ్లు పెట్టుకున్న శేఖర్!

రాకేశ్ మాస్టర్ నిన్న మరణించిన సంగతి అందరికి తెలిసిందే. కాగా ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన శేఖర్ మాస్టర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Rakesh Master : రాకేశ్ మాస్టర్ పార్థివదేహానికి శేఖర్ మాస్టర్ నివాళులు.. కన్నీళ్లు పెట్టుకున్న శేఖర్!

Sekhar Master pays last rites to Rakesh Master and getting emotional

Rakesh – Sekhar Masters : టాలీవుడ్ కొరియోగ్రఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ నిన్న (జూన్ 18) సాయంత్రం మరణించారు. అయన మరణవార్త ఇండస్ట్రీలోని డాన్సర్స్ ని తీవ్రంగా బాధిస్తుంది. ఇండస్ట్రీకి వద్దామనుకున్న ఎంతోమందికి ఆయన చేయూతను అందించారు. తన ఇంటిలోనే పెట్టుకొని ఎంతోమందికి అన్నం పెట్టారు. ఇప్పుడు ఆయన చనిపోయారు అంటే ఆ సహాయం అందుకున్న వారి మనసు కన్నీరు పెడుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్స్ గా కొనసాగుతున్న ఎంతోమంది రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేసినవారే. వారిలో జానీ మాస్టర్ (Jani Master), శేఖర్ మాస్టర్ (Sekhar) కూడా ఉన్నారు.

Rakesh Master : నన్ను అక్కడే సమాధి చేయండి.. ముందే చెప్పిన రాకేష్ మాస్టర్..

అయితే శేఖర్ మాస్టర్ పై రాకేశ్ మాస్టర్స్ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. వారి ఇద్దరి మధ్య ఏమి గొడవ అయ్యిందో మాత్రం తెలియలేదు. ఈ విషయం పై శేఖర్ మాస్టర్ కూడా స్పందించడానికి నిరాకరిస్తుంటాడు. దీంతో ఇప్పుడు రాకేశ్ మాస్టర్ పార్ధివదేహాన్ని చూడడానికి శేఖర్ మాస్టర్ వస్తాడా? అని అందరిలో సందేహం మొదలయింది. అయితే శేఖర్ మాస్టర్ మాత్రం తన గురుభక్తి నిరూపించుకున్నాడు. వారి ఇద్దరి మధ్య ఏమైనా జరిగి ఉండవచ్చు, కానీ తన గురువు ఇక లేదు అన్న విషయం శిష్యుడు మనసుని కదిలించింది.

Rakesh Master : రాకేశ్‌ మాస్టర్‌ మృతి.. ప్రభాస్‌కి డాన్స్ నేర్పిస్తున్న ఫోటో వైరల్..

రాకేశ్ మాస్టర్ ని కడసారి చూసేందుకు శేఖర్ వచ్చారు. ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పిస్తూ కన్నీరుమున్నీరు అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. కాగా రాకేశ్ మాస్టర్ ని శేఖర్ తో గొడవ ఏంటని పలుమార్లు ప్రశ్నించనప్పటికీ, అడిగిన ప్రతిసారి అసలు విషయం చెప్పకుండా అనేక కారణాలు చెప్పేవారు. శేఖర్ వాళ్ల పాప పుట్టినరోజుకి పిలవలేదని, చిరంజీవి సాంగ్ ఆఫర్ వస్తే తనకి చెప్పలేదని.. ఇలా ఒకొక్కసారి ఒకొక రీజన్ చెప్పువారు. ఇక శేఖర్ మాస్టర్ ని అడిగితే.. రాకేశ్‌ మాస్టర్‌ కోపానికి కారణం ఏంటో తనకి తెలియదని చెప్పుకొచ్చాడు.