Jawan : షారుఖ్ జవాన్ సినిమా విషయంలో నమోదైన పోలీస్ కేసు.. ఎందుకో తెలుసా..?

పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత షారుక్ ఖాన్ నటిస్తున్న చిత్రం 'జవాన్'. సెప్టెంబర్ 7న విడుదల కాబోతున్న ఈ మూవీ విషయంలో పోలీస్ స్టేషన్ లో కేసు..

Jawan : షారుఖ్ జవాన్ సినిమా విషయంలో నమోదైన పోలీస్ కేసు.. ఎందుకో తెలుసా..?

Shah Rukh Khan file a case on who leak video clips from Jawan sets

Jawan : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ (Shah Rukh Khan) పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఇక ఈ మూవీ తరువాత షారుఖ్ నుంచి వస్తున్న తదుపరి సినిమా ‘జవాన్’. తమిళ్ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని.. తన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై షారుఖ్ స్వయంగా నిర్మిస్తుండడంతో మూవీ పై ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. ఇక ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. దీంతో ఈ మూవీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Chiranjeevi : భోళా శంకర్ అయిపోయింది.. చిరు నెక్స్ట్ ఏంటి? బర్త్ డేకి ఆ దర్శకుడితో సినిమా అనౌన్స్?

ఇది ఇలా ఉంటే, ఈ మూవీ యూనిట్ ఒక విషయం ఇబ్బందికరంగా మారింది. సినిమాకి సంబంధించిన కొన్ని క్లిప్‌లు లీక్ అయ్యాయి. ఆ క్లిప్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ విషయాన్ని షారుఖ్ చాలా సీరియస్ గా తీసుకున్నాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తరుపు నుంచి పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశాడు. మూవీ సెట్స్ నుంచి ఆ క్లిప్స్ ని దొగ్గలించి పోస్ట్ చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ల కింద ముంబైలోని శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Sridevi Birthday : ఈ రోజు శ్రీదేవి బర్త్ డే.. గూగుల్ స్పెషల్ డూడుల్

ఈ చిత్రం నుండి షారుఖ్ ఖాన్ గుండుతో ఉన్న రూపానికి సంబంధించిన రెండు చిత్రాలు మరియు వీడియోలు లీక్ అయ్యినట్లు సమాచారం. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. విజయ్ సేతుపతి, నయనతార, సన్యా మల్హోత్రా మరియు ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీపికా పదుకొనె, తమిళ్ హీరో విజయ్ అతిథి పాత్రల్లో కనిపించబోతున్నారు. షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.