Jawan Trailer : జవాన్ ట్రైలర్‌కి డేట్ ఫిక్స్ చేసిన షారుఖ్ ఖాన్.. ఆ రోజునే పవర్‌ఫుల్ కట్..

ఇప్పటికే 'ప్రివ్యూ' అంటూ ఒక ట్రైలర్ కట్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన షారుఖ్ ఖాన్ ఇప్పుడు..

Jawan Trailer : జవాన్ ట్రైలర్‌కి డేట్ ఫిక్స్ చేసిన షారుఖ్ ఖాన్.. ఆ రోజునే పవర్‌ఫుల్ కట్..

Shah Rukh Khan Nayanathara Jawan Trailer released on rakhi

Updated On : August 28, 2023 / 8:26 PM IST

Jawan Trailer : తమిళ్ దర్శకుడు అట్లీ, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ (Shah Rukh Khan) కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘జవాన్’. నయనతార (Nayanathara) ఈ సినిమాలో హీరోయిన్ గా, విజయ్ సేతుపతి విలన్ గా కనిపించబోతున్నారు. ఇక ప్రియమణి, సన్య, యోగిబాబు ముఖ్యపాత్రల్లో నటిస్తుంటే దీపికా పదుకొనే అతిధి పాత్రలో మెరవబోతుంది. దాదాపు మూవీ పనులన్నీ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా మూవీలోని సాంగ్స్ ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు.

Anushka Shetty : ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ప్రమోషన్స్‌కి అనుష్క దూరం.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి..!

అలాగే మూవీ నుంచి ‘ప్రివ్యూ’ అంటూ ఒక ట్రైలర్ కట్ ని మేకర్స్ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రివ్యూ వీడియో మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసింది. అయితే పిక్చర్ అప్పుడే అయ్యిపోలేదు, మరో ట్రైలర్ కట్ బాకీ ఉందట. ఈ ట్రైలర్ ని పవర్‌ఫుల్ యాక్షన్ కట్ తో రెడీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్ ని ‘రాఖీ’ కానుకగా ఆగష్టు 31న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు గాని, బాలీవుడ్ లో మాత్రం గట్టిగా వినిపిస్తుంది.

Shah Rukh Khan – Rashmika : షారుఖ్ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న రష్మిక.. ఏ ప్రాజెక్ట్ తెలుసా..?

కాగా ఈ సినిమాలో షారుఖ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఇక ప్రివ్యూలో బోడి గుండు గెటప్ లో కనిపించి అందర్నీ షాక్ చేశాడు. ఈ సినిమా కథ నచ్చడంతో తానే నిర్మాతగా వ్యవహరిస్తూ.. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో విజయ్ (Vijay) కూడా అతిధి పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. అయితే మూవీ టీం నుంచి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.