Shahrukh-Deepika : కలిసొచ్చిన దీపికా-షారుఖ్ కాంబో.. పఠాన్ కి ఇది కూడా ప్లస్సే..

షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ జంట కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది అంటున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో మూడు సినిమాలు రాగా మూడు మంచి విజయాలు సాధించాయి. షారుఖ్-దీపికా కాంబోలో.............

Shahrukh-Deepika : కలిసొచ్చిన దీపికా-షారుఖ్ కాంబో.. పఠాన్ కి ఇది కూడా ప్లస్సే..

Shahrukh Khan and Deepika Padukone combo is plus to Pathaan movie

Updated On : January 30, 2023 / 12:53 PM IST

Shahrukh-Deepika :  ఇటీవల షారుఖ్ ఖాన్ నుంచి రిలీజయిన పఠాన్ సినిమా మంచి విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. షారుఖ్, దీపికా జంటగా, జాన్ అబ్రహం విలన్ గా, సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా జనవరి 25న రిలీజయి థియేటర్స్ లో సందడి చేస్తుంది. పఠాన్ సినిమా హిట్ అవ్వడానికి అనేక అంశాలు తోడయ్యాయి.

సినిమా కథ పాతదే అయినా సరికొత్త కథనం, షారుఖ్ నాలుగేళ్ల తర్వాత కనపడటం, ఫుల్ యాక్షన్ సీన్స్ తో సినిమా ఉండటం, దేశభక్తి కాన్సెప్ట్ కావడం, పాటలు వైరల్ అవ్వడం, వారం రోజుల వరకు ఏ సినీ పరిశ్రమలోనూ పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోవడం.. ఇలా అన్ని అంశాలు కలిసొచ్చి పఠాన్ కి కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. అయితే వీటితో పాటు మరో అంశం కూడా ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది.

Hansika : సింగిల్ షాట్.. సింగిల్ క్యారెక్టర్‌తో హన్సిక ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ సినిమా..

షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ జంట కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది అంటున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో మూడు సినిమాలు రాగా మూడు మంచి విజయాలు సాధించాయి. షారుఖ్-దీపికా కాంబోలో మొదటి సినిమా 2007 లో ‘ఓం శాంతి ఓం’ సినిమా వచ్చింది. ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇది దీపికాకి బాలీవుడ్ లో మొదటి సినిమా కావడం విశేషం. అనంతరం 2013లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సినిమా కూడా భారీ విజయం సాధించింది. ఆ తర్వాత 2014లో వచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా అభిమానులకి నచ్చింది. ఈ సినిమా మాములు విజయం సాధించింది. ఇలా మూడు సినిమాలు విజయాలు సాధించడంతో నాలుగోసారి ఈ కాంబో వస్తుండటంతో వీరి వల్ల కూడా సినిమాపై అంచనాలు ముందునుంచి ఉన్నాయి. ఇక బేషరంగ్ పాటతో సినిమా ముందే వీరిద్దరి మధ్య మంచి సీన్స్ ఉండబోతున్నట్టు అంచనా వేశారు. దీంతో షారుఖ్-దీపికా కాంబో కూడా పఠాన్ సినిమాకి ప్లస్ అయి విజయానికి మరో కారణమైంది. పఠాన్ సినిమా ఇప్పటివరకు అయిదు రోజుల్లో 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.