Sharwanand : మొదలైన శర్వానంద్ పెళ్లి సంబరం.. వీడియో వైరల్!

శర్వానంద్, రక్షిత పెళ్లి సంబరం మొదలైంది. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వా హల్దీ వేడుకలో పసుపు రాసుకుంటూ సందడి చేస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియో..

Sharwanand : మొదలైన శర్వానంద్ పెళ్లి సంబరం.. వీడియో వైరల్!

Sharwanand marriage Haldi Ceremony celebrations at jaipur palace

Updated On : June 2, 2023 / 4:58 PM IST

Sharwanand : టాలీవుడ్ హీరో శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 26న రక్షిత అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తో శర్వా నిశ్చితార్థం చేసుకున్నాడు. వీరిద్దరి నిశ్చితార్ధానికి టాలీవుడ్ లోని పలువురు స్టార్స్ హాజరయ్యి సందడి చేయగా.. ఆ ఫొటోలో నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. నిశ్చితార్ధం జరిగిన ఆరు నెలలు తరువాత ఇప్పుడు వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వా అండ్ రక్షిత వివాహం జరగబోతుంది. ఈ వివాహ సంబరం నేడు, రేపు (జూన్ 2,3) జరగబోతుంది.

C Kalyan : కొంతమంది సినిమా వాళ్ళ విమర్శలు పట్టించుకోనవసరం లేదు.. ఏపీ ఫైబర్ నెట్ పస్ట్ డే పస్ట్ షోపై నిర్మాత సి కళ్యాణ్ సంచలన కామెంట్స్..

నేడు మెహందీ ఫంక్షన్, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుని చేయడం, పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఫంక్షన్ లో శర్వానంద్ ఫామిలీ తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. హల్దీ వేడుకలో పసుపు రాసుకుంటూ సందడి చేస్తున్న శర్వానంద్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈరోజు సాయంత్రం 5గంటలకు మెహందీ కార్యక్రమం, రేపు ఉదయం 11గంటలకు పెళ్లి కొడుకు వేడుక జరగనుంది. రేపు రాత్రి 11 గంటలకు వీరిద్దరి వివాహం జరగబోతుంది అని తెలుస్తుంది. ఇక ఈ మ్యారేజ్ కి టాలీవుడ్ నుంచి సెలబ్రెటీస్ ఎవరెవరు హాజరవుతున్నారు అనే దాని పై ఆసక్తి నెలకుంది. శర్వా స్నేహితులు రామ్ చరణ్, రానా పెళ్ళికి వెళుతున్నారా? అని వారి ఫోటోలు కోసం అభిమానులు చూస్తున్నారు.

Nenu Student Sir Twitter Review : నేను స్టూడెంట్ సర్ ట్విట్టర్ రివ్యూ.. మాములుగా లేదట.. ఇంటర్వెల్ అదిరిపోయింది..

అలాగే రక్షిత రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం కావడంతో పొలిటికల్ లీడర్స్ కూడా పెళ్ళికి వచ్చే అవకాశం ఉంది. ఇక శర్వా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తన 35వ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మొన్నటి వరకు ఈ మూవీ షూటింగ్ ఫారిన్ లో ఏకధాటిగా జరిగింది. ఈ పెళ్లి వల్ల కొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.