Shruthi Haasan : మెగా ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన శృతి హాసన్.. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావట్లేదంట..
ఇటీవలే వీరసింహా రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న శ్రుతిహాసన్ ఆ తర్వాత అనారోగ్యానికి గురయింది. దీంతో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తాను చాలా డల్ గా ఉన్న ఫోటోని పోస్ట్ చేసి నాకు ఆరోగ్యం బాగోలేదు, ఇది కోవిడ్ కాకుండా ఉంటే బాగుండు అని పోస్ట్ చేసింది. అలాగే మరో స్టోరీలో....................

Shruthi Haasan not coming to waltair veerayya pre release event
Shruthi Haasan : మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా రవితేజ ముఖ్య పాత్రలో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజుల తర్వాత చిరంజీవి ఫుల్ మాస్ కామెడీ సినిమా చేస్తుండటంతో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా భారీగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు విశాఖలో వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి, రవితేజతో పాటు చిత్ర యూనిట్ అంతా విచ్చేస్తున్నారు. కానీ హీరోయిన్ శృతి హాసన్ రావట్లేదని అభిమానులకి షాక్ ఇచ్చింది.
Dhanush : ధనుష్ మరో తెలుగు సినిమాకి ఓకే చెప్పాడా??
ఇటీవలే వీరసింహా రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న శ్రుతిహాసన్ ఆ తర్వాత అనారోగ్యానికి గురయింది. దీంతో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తాను చాలా డల్ గా ఉన్న ఫోటోని పోస్ట్ చేసి నాకు ఆరోగ్యం బాగోలేదు, ఇది కోవిడ్ కాకుండా ఉంటే బాగుండు అని పోస్ట్ చేసింది. అలాగే మరో స్టోరీలో.. నేను అనారోగ్యం కారణంగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేకపోతున్నాను. ఇందుకు చాలా బాధగా ఉంది. ఈ సినిమాలో చిరంజీవి గారితో పనిచేయడం నాకు గౌరవంగా ఉంది. ఈ రోజు ఈవెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని తెలిపింది. ఇంత పెద్ద మెగా ఈవెంట్ కి శృతి హాసన్ రాను అని తెలపడంతో ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు. అలాగే ఆమె త్వరగా కోలుకొని మళ్ళీ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.