Tillu Square : ‘టిల్లు స్క్వేర్’లో ఆ హీరోయిన్ గెస్ట్ అప్పీరెన్స్.. రాధికా సినిమాటిక్ యూనివర్స్..

 సిద్ధూ జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రాబోతున్న సంగతి తెలిసిందే.

Tillu Square : ‘టిల్లు స్క్వేర్’లో ఆ హీరోయిన్ గెస్ట్ అప్పీరెన్స్.. రాధికా సినిమాటిక్ యూనివర్స్..

Siddhu Jonnalagadda Planning h Radhika Cinematic Universe with DJ Tillu Movie series

Updated On : February 25, 2024 / 5:39 PM IST

Tillu Square : సిద్ధూ జొన్నలగడ్డ డీజే టిల్లు(DJ Tillu) సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్స్, సాంగ్ రిలీజ్ అయి సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్(Anupama Parameswaran) గా నటిస్తుంది. ఈ సినిమాలో అనుపమ మరింత బోల్డ్ గా నటిస్తుండటం, కామెడీ, ట్విస్ట్ లు కూడా డీజే టిల్లు కంటే ఎక్కువగా ఉంటాయని తెలియడంతో యూత్ టిల్లు స్క్వేర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన టిల్లు స్క్వేర్ సినిమా మార్చ్ 29న రిలీజ్ కానుంది. ఆల్రెడీ ఈ సినిమాని ఫ్రాంచైజ్ గా ఇంకో రెండు, మూడు పార్టులు కూడా తీస్తానని గతంలోనే సిద్ధూ ప్రకటించాడు. అయితే ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది. తాజాగా ఈ సినిమాలు రాధికా సినిమాటిక్ యూనివర్స్ అని సరికొత్తగా ప్లాన్ చేస్తారట. మొదటి పార్ట్ లో హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి టిల్లు స్క్వేర్ లో కాసేపు గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతుందని సమాచారం. నేహా శెట్టితో లీడ్ తీసుకొని సినిమా రన్ అవుతుందని తెలుస్తుంది.

Also Read : RC 16 Update : రామ్ చరణ్ – బుచ్చిబాబు సాన RC16 సినిమా కాస్ట్ & క్రూ ఇదే..

అలాగే నెక్స్ట్ రాబోయే సినిమాలో అనుపమ పరమేశ్వరన్ గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తుందని.. ఇలా హీరోయిన్స్ నెక్స్ట్ సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇప్పిస్తూ రాధికా సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇటీవల అందరూ సినిమాటిక్ యూనివర్స్ లు ప్లాన్ చేస్తూ తమ సినిమాలపై అంచనాలు పెంచుతున్నారు. డీజే టిల్లు లో రాధికా పాత్ర బాగా వైరల్ అయింది, ఇప్పుడు టిల్లు స్క్వేర్ లో ఆ పేరు మీద పాట కూడా పెట్టారు, ఆ పేరుతో చాలా డైలాగ్స్ కూడా ఉన్నాయి.. అందుకే అదే పేరుతో రాధికా సినిమాటిక్ యూనివర్స్ పెట్టి హీరోయిన్స్ కి లింక్ ఇచ్చి నెక్స్ట్ సినిమాలు కూడా ప్లాన్ చేస్తారని తెలుస్తుంది.