Tillu Square : టిల్లు స్క్వేర్ నుంచి బిగ్‌ అప్‌డేట్‌..

సిద్ధు జొన్న‌లగ‌డ్డ న‌టిస్తున్న సినిమా ‘టిల్లు స్క్వేర్’. డీజే టిల్లుకి సీక్వెల్ గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది

Tillu Square : టిల్లు స్క్వేర్ నుంచి బిగ్‌ అప్‌డేట్‌..

Tillu Square

Updated On : October 26, 2023 / 10:07 PM IST

Update From Tillu Square : సిద్ధు జొన్న‌లగ‌డ్డ న‌టిస్తున్న సినిమా ‘టిల్లు స్క్వేర్’. డీజే టిల్లుకి సీక్వెల్ గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. మల్లిక్ రామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ కథని అందించ‌గా రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌న్ ట్రాక్ వీడియోతో పాటు ‘టికెట్ కొనకుండా’ అనే పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

తాజాగా ఈ సినిమా నుంచి మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించ‌నున్న‌ట్లు చిత్ర బృందం వెల్ల‌డించింది. శుక్ర‌వారం ఉద‌యం 11.07 నిమిషాల‌కు మేజ‌ర్ అప్‌డేట్ ఇవ్వ‌నున్న‌ట్లు ఓ పోస్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. వేచి చూడండి.. అప్‌డేట్‌ను మిస్ కావొద్దు అంటూ ట్వీట్ చేసింది.

Madurai : రజనీకాంత్‌కి గుడి కట్టిన అభిమాని.. 250 కిలోల విగ్రహానికి రోజూ పూజలు

కాగా.. సినిమా విడుద‌ల తేదీపై గురించి చెప్పే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. వాస్త‌వానికి ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 15న విడుద‌ల చేస్తామ‌ని మొద‌ట ప్ర‌క‌టించారు. అయితే.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి కాక‌పోవ‌డంతో సినిమా విడుద‌ల తేదీని పోస్ట్ పోన్ చేస్తున్న‌ట్లు చెప్పారు. అయితే.. ఎప్పుడు విడుద‌ల చేస్తామ‌నే సంగ‌తి చెప్ప‌లేదు. దీంతో రేప‌టి అప్డేట్ రిలీజ్ డేట్ కావ‌చ్చున‌ని అంటున్నారు.