Singer Sunitha : వ్యాపారరంగంలోకి సింగర్ సునీత ?

సింగర్ సునీత. అందరికీ తెలిసిందే. తన గాతృ మాధుర్యంతో అలరిస్తున్నారు. ఆమె పాట పాడుతుంటే..పరవశించే వారుండరంటే అతిశయోక్తి కాదు. వందలాది పాటలు పాడిన ఈమెకు ఎంతో మంది అభిమానులున్నారు. రామ్ వీరపనేని అనే వ్యాపార వేత్తతో పలు ఈవెంట్లు, టీవీషోల్లో కనబడడంతో పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరిగింది. చివరకు వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

Singer Sunitha : వ్యాపారరంగంలోకి సింగర్ సునీత ?

Singer Sunitha

Updated On : June 30, 2021 / 11:09 AM IST

Singer Sunitha : సింగర్ సునీత. అందరికీ తెలిసిందే. తన గాతృ మాధుర్యంతో అలరిస్తున్నారు. ఆమె పాట పాడుతుంటే..పరవశించే వారుండరంటే అతిశయోక్తి కాదు. వందలాది పాటలు పాడిన ఈమెకు ఎంతో మంది అభిమానులున్నారు. రామ్ వీరపనేని అనే వ్యాపార వేత్తతో పలు ఈవెంట్లు, టీవీషోల్లో కనబడడంతో పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరిగింది. చివరకు వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

అయితే..భర్త వీరపనేనితో కలిసి బిజెనెస్ రంగంలోకి దిగాలని సునీత ఆలోచిస్తున్నారని సమాచారం. ఇప్పటికే రామ్ మ్యాంగ్ వీడియోస్ తో పాటు మరికొన్ని డిజిటల్ ఛానల్స్ హెడ్ గా నిర్వహిస్తున్నారు. సునీతతో కలిసి మ్యాంగో బ్యానర్ పై సిరీస్ లు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కొత్త టాలెంట్ ను ప్రోత్సాహించాలనే ఉద్దేశ్యంతో వెబ్ సిరీస్ లకు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించానున్నారంట.

దీనికి సంబంధించి..త్వరలోనే అధికారికంగ ప్రకటన వస్తుందనే తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా కారణంగా..సినిమా థియేటర్లు ఓపెన్ కావడం లేదు. దీంతో ఓటీటీ ప్లాట్ ఫాం..కు ఫుల్ డిమాండ్ పెరిగింది. పెద్ద పెద్ద సినిమాలు సైతం డిజిటల్ ప్లాట్ ఫాంలో రిలీజ్ చేస్తున్నారు.