Sunitha : బ్రేకప్ చెప్పుకోవడం ఈజీ అయిపోయింది.. ఆడపిల్లలపై చెత్త కామెంట్లు ఎక్కువైపోయాయి.. ఆ సింగర్ ఆసక్తికర వ్యాఖ్యలు

సింగర్ సునీత గాయనిగా ఎంట్రీ ఇచ్చి 28 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ సింగర్‌గా తరగని పాపులారిటీతో ముందుకు వెళ్తున్నారామె. తాజాగా సునీత మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.

Sunitha :  బ్రేకప్ చెప్పుకోవడం ఈజీ అయిపోయింది.. ఆడపిల్లలపై చెత్త కామెంట్లు ఎక్కువైపోయాయి.. ఆ సింగర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Sunitha

Sunitha : సునీత సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎంతో పేరు తెచ్చుకున్నారు. 15 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికీ సక్సెస్ ఫుల్‌గా ముందుకు వెళ్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన సునీత ఇప్పటి జనరేషన్ బ్రేకప్ స్టోరీలు.. సోషల్ మీడియాలో ఆడపిల్లలపై వచ్చే ట్రోలింగ్స్ గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేసారు.

Vijay Rashmika : బాలయ్య షోలో విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్ గురించి.. విజయ్‌కి కాల్ చేయగానే సిగ్గుపడిన రష్మిక..

గులాబీ సినిమాలో ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు’ అనే పాటతో మొదలైన గాయని సునీత కెరియర్ ఎటువంటి బ్రేక్ లేకుండా ముందుకు దూసుకుపోతోంది. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎంతోమంది హీరోయిన్లకు వాయిస్ ఇచ్చారు సునీత. మొదటి వివాహంలో ఒడిదుడుకులు ఎదుర్కున్న సునీత 2021 లో మ్యాంగో మీడియా గ్రూప్ ఓనర్ రామ్ వీరపనేనిని పెళ్లాడారు. తన కెరియర్ దాదాపుగా 28 సంవత్సరాలు పూర్తైన సందర్భంలో సునీత మీడియాతో రొటీన్‌కి కాస్త భిన్నంగా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు.

ఇటీవల కాలంలో ప్రేమ, పెళ్లి విషయంలో ఎన్నో బ్రేకప్ లు అవుతున్నాయని.. లవ్ లైఫ్‌ను ఎంజాయ్ చేయలేకపోతున్నారని అన్నారు సునీత. శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కుంటే తప్ప చిన్న చిన్న విషయాల్లో బ్రేకప్ చెప్పుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని అన్నారు. లవ్ బ్రేకప్‌కి ఒక పార్టీ.. కొత్త లవర్ దొరికితే మరో పార్టీ ఇచ్చుకుంటూ రిలేషన్స్ నుంచి ఈజీగా బయటకు వచ్చేస్తున్నారని సునీత కామెంట్ చేసారు. డ్రెస్సింగ్ విషయం ప్రస్తావిస్తూ  డ్రెస్సింగ్‌ను బట్టి అవతలి వ్యక్తి మంచి వారా? చెడ్డవారా? అనేది జడ్జ్ చేయలేమన్నారు సునీత. అలవాట్లు చెడ్డవి అయినంత మాత్రాన మనిషి చెడ్డవారు అని డిఫైన్ చేయలేమని చెప్పారు. చీరలో మాత్రం ఒద్దికగా ఉండే లక్షణాలు ఉంటాయని చీరకట్టుకోవడం భారతదేశంలోనే ఉత్తమమైన విషయంగా చెప్పారు సునీత.

Allu Arjun : వరుణ్ పెళ్లి నుంచి అల్లు అర్జున్ ఫ్యామిలీ క్యూట్ పిక్స్ చూశారా? బన్నీ కూతుర్ని ఎత్తుకొని.. అయాన్ ఎక్కడ?

చాలామంది తనది ఫేక్ స్మైల్ అని కామెంట్లు చేసేవారని అన్నారు సునీత. మాట్లాడుతున్నప్పుడు హస్కీగా ఉంటుంది.. మాటలు మింగేస్తుందని, ఎప్పుడూ ఏడుస్తుందని విమర్శలు చేసిన వాళ్లు కూడా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా తన కెరియర్‌ను ఎప్పుడూ బ్రేక్ చేసుకోలేదని సునీత అన్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా రికార్డింగ్ స్టూడియోలోకి వెళ్లేసరికి తనకు తన వృత్తి మాత్రమే గుర్తుండేదని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆడపిల్లల్ని చెత్త మాటలు అంటూ ట్రీట్ చేసే విధానం చాలా బాధ కలిగిస్తోందన్నారు. ప్రతిరోజు వచ్చే కొన్ని వందల చెత్త కామెంట్లలో ఒకే ఒక పాజిటివ్ కామెంట్ తాను చదువుతానని.. అది ఆ చెత్త కామెంట్లను మర్చిపోయేలా చేస్తుందని అలాంటి వారి స్మైల్ కోసమే తాను పాడతానని చెప్పారు సునీత. సునీత తాజా కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.