Sitara Ghattamaneni: సితార స్పెషల్ డాన్స్.. వీడియో షేర్ చేసిన మహేష్!
నేడు శ్రీరామ నవమి పండగ సందర్భంగా సెలెబ్రిటీలు సైతం తమ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే చిరంజీవి శ్రీరామ నవమి విషెస్ తో స్పెషల్..

Sitara Ghattamaneni
Sitara Ghattamaneni: నేడు శ్రీరామ నవమి పండగ సందర్భంగా సెలెబ్రిటీలు సైతం తమ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే చిరంజీవి శ్రీరామ నవమి విషెస్ తో స్పెషల్ ట్వీట్ చేయగా.. కొత్త సినిమాల పోస్టర్లతో మేకర్స్ ప్రేక్షకులకు, అభిమానులకు స్పెషల్ ట్రీట్స్ ఇచ్చారు. కాగా తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు తన గారాలపట్టి సితార కూచిపూడి డ్యాన్స్ కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
Sitara Ghattamaneni : యాని మాస్టర్‌తో స్టెప్పులు ఇరగదీస్తున్న మహేష్ కూతురు.. ప్రాక్టీస్ దేనికోసమో?
మహేశ్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సంగతి తెలిసిందే. మహేష్ హీరోగా వస్తున్న సర్కారు వారి పాట సినిమా నుండి లాస్ట్ టైం వచ్చిన పెన్నీ సాంగ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన అంశం ఏదన్నా ఉంది అంటే అది మహేష్ కూతురు సితార చేసిన స్టైలిష్ పెర్ఫామెన్స్ అని చెప్పాలి. కాగా, ఇప్పుడు సితార తొలిసారిగా కూచిపూడి డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను మహేశ్ బాబు తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
Sitara: సూపర్ డాటర్ వచ్చేసింది.. హైలైట్‌గా మారిన సితార ఎంట్రీ!
సితార తొలి కూచిపూడి డ్యాన్స్ ఇది. శ్రీరామనవమి పర్వదినాన ఈ నృత్య ప్రదర్శనను మీకు చూపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాముడి గొప్పదనాన్ని ఈ శ్లోకం తెలియజేస్తుందని సితార వీడియోను మహేశ్ పోస్టు చేశారు. తమ కూతురు సితారకు కూచిపూడి నేర్పించిన వారికి మహేశ్ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సితార చేసిన డ్యాన్స్ పై మహేశ్ బాబు ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
View this post on Instagram