‘ఢీ’ టీమ్ లాంచ్ చేసిన ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ ట్రైలర్..

‘జబర్దస్త్’, ‘ఢీ’, ‘పోవే పోరా’ వంటి సూపర్‌హిట్ టెలివిజన్ షోస్ ద్వారా ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ హీరోగా, ‘రాజుగారి గది’ ఫేమ్ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ బేనర్‌పై ప్రొడక్షన్ నెం: 1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’. ఈ సినిమా ద్వారా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ రాగా లేటెస్ట్‌గా ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ మాస్టర్ విడుదల చేసి టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నటి పూర్ణ, శేఖర్ మాస్టర్, సుడిగాలి సుధీర్, ప్రదీప్, రష్మీ, వర్షిణి, హైపర్ ఆది, దర్శకుడు రాజశేఖర్ పులిచర్ల, నిర్మాత శేఖర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటి పూర్ణ మాట్లాడుతూ : “ట్రైలర్ చాలా బాగుంది. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.
శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ : “కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్ పలికించగల సుధీర్ హీరోగా చేస్తున్న మొదటి సినిమా. ట్రైలర్ నాకు బాగా నచ్చింది. సుధీర్ మంచి డాన్సర్ కూడా.. ట్రైలర్‌లో కూడా డాన్స్ మూమెంట్స్ చాలా బాగున్నాయి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు.
ఈ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్ ఓ పాటలో నటించారు. సీనియర్ నటి ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, నాజర్, షాయాజీ షిండే, డా. ఎన్. శివప్రసాద్, పృథ్వీ, సంజయ్ స్వరూప్, రవికాలే, విద్యుల్లేఖ, టార్జాన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎడిటర్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సి.రామ్‌ప్రసాద్, ఆర్ట్: నారాయణరావు, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, నందు, స్టంట్ జాషువ, అంజి, డాన్స్: అనీష్ మాస్టర్, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలె, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: భిక్షపతి తుమ్మల, పాటలు: గద్దర్, సురేష్ ఉపాధ్యాయ, నిర్మాత: కె.శేఖర్‌రాజు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల.