ఇదీ టాలీవుడ్ సత్తా..! ఇండియన్ ఇండస్ట్రీని దున్నేస్తున్న మన హీరోలు..!

పాన్ ఇండియా ట్రెండ్ ని బాహుబలి మొదలు పెడితే.. తగ్గేదేలే అని పుష్ప బాలీవుడ్ అందుకోని మెట్టు మీద టాలీవుడ్ ను కూర్చోబెట్టాడు.

ఇదీ టాలీవుడ్ సత్తా..! ఇండియన్ ఇండస్ట్రీని దున్నేస్తున్న మన హీరోలు..!

Updated On : November 18, 2024 / 12:32 AM IST

Tollywood Stamina : టాలీవుడ్ కాదు.. పూనకాల ఉడ్.. పుష్ప 2 ట్రైలర్ తర్వాత వినిపిస్తున్నా మాట ఇది. హీరో కావొచ్చు, డైరెక్టర్ కావొచ్చు.. పాన్ ఇండియా సినిమా అంటే మనోళ్లు ఉండాల్సిందే. వచ్చారు, వస్తున్నారు, రాబోతున్నారు.. పాన్ ఇండియాలో మన హీరోలదే ఆధిపత్యం. దేవర మొదలు పెట్టాడు. పుష్ప అందుకునేందుకు రెడీ అయ్యాడు. గేమ్ ఛేంజర్ కంటిన్యూ చేయబోతున్నాడు. రాబోయే రోజుల్లో..కాదు కాదు.. ఇండియా మొత్తం టాలీవుడ్ హీరోలే కనిపించడం ఖాయం. మనోళ్లు ఎవరెవరు రెడీగా ఉన్నారు? పాన్ ఇండియా సినిమాకు టాలీవుడ్ కేరాఫ్ గా మారిందా?

ఒకప్పుడు పాన్ ఇండియా సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే. మంచివి చేసినా తెలుగు మూవీస్ ని సపోర్ట్ చేసేందుకు ముందుకు వచ్చే వారు కాదు ఎవరూ. మన హీరోలన్నా, సినిమాలన్నా చిన్న చూపు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదుగా. ఒక్కడొచ్చాడు, ఒకన్ని కలుపుకుని వచ్చాడు.. టాలీవుడ్ స్టామినా ఏంటో, స్థాయి ఏంటో చూపించాడు. తెలుగు సినిమా అంటే హిందీ జనం ఫిదా అయ్యేలా చేశాడు. ఆ ఇన్స్ పిరేషన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. పాన్ ఇండియా ట్రెండ్ ని బాహుబలి మొదలు పెడితే.. తగ్గేదేలే అని పుష్ప బాలీవుడ్ అందుకోని మెట్టు మీద టాలీవుడ్ ను కూర్చోబెట్టాడు. ట్రైలర్ ఈవెంట్ కే నార్త్ షేక్ అయ్యిందంటే.. పుష్ప గాడి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

పుష్ప కోసం హిందీ ప్రేక్షకులు కసి మీదున్నారు. ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో హిందీ డైరెక్టర్లు ఫెయిల్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సౌత్ స్టామినా ఏంటో, తెలుగు హీరోల సత్తా ఏమిటో ఈ జనరేషన్ ప్రూవ్ చేసింది. బాలీవుడ్ హీరోలకు తలదన్నే క్రేజ్ ను సంపాదించారు మన వాళ్లు. నిలబడటానికి చోటు కోసం చూసిన టాలీవుడ్.. ఇప్పుడు ఏకంగా సింహాసనం వేసుకుని మరీ కూర్చుంది.

బాహుబలితో ప్రభాస్ హిందీ హీరో అయిపోయాడు. ఇప్పుడు అల్లు అర్జున్ పేరు బాలీవుడ్ లో మార్మోగిపోతోంది. పుష్పతో బన్నీకి నార్త్ లో వచ్చిన క్రేజ్ చూస్తే.. పిచ్చెక్కిపోవడం ఖాయం. పుష్ప 2 కు ప్రమోషన్స్ వీక్ అయినా.. అంచనాలు ఆకాశానికి చేరాయంటే అర్థం చేసుకోవచ్చు క్రేజ్ ఎలా ఉందో. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అన్నట్లు.. తెలుగు సినిమా అంటే చాలు హిందీ జనాలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రెస్పాన్స్ చూస్తే బాలీవుడ్ కి కూడా పిచ్చెక్కి పోవాల్సిందే. సోషల్ మీడియా మొత్తం పుష్ప హవానే. రిలీజ్ అవుతోంది సినిమానా, ట్రైలరా అనే రేంజ్ లో బజ్ క్రియేట్ అయ్యింది. టాలీవుడ్ నుంచి రాబోయే సినిమాల కోసం దేశమంతా ఎదురుచూస్తోంది.

దేశంలో ఏ భాష మాట్లాడే వారైనా తెలుగు సినిమాలు అంటే ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ పాన్ ఇండియా స్టార్లుగా గుర్తింపు సాధించారు. వీరు నటిస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. వీరితో పాటు పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, రాజమౌళి సినిమాతో మహేశ్ బాబు పాన్ ఇండియా క్యాటగిరీలోకి తొలిసారిగా అడుగు పెడుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ వార్ 2తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

పూర్తి వివరాలు..

Also Read : ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్.. కానీ ఇప్పుడు వివాదం ఎందుకు.. ధనుష్ వర్సెస్ నయనతార..