Bhala Thandanana: యాక్షన్‌లోకి దిగిన శ్రీవిష్ణు.. లుక్ అదిరిందిగా!

విభిన్నమైన కథలతో ఒక సినిమా రిలీజ్ అయ్యేలోపు మరో సినిమాను ప్రకటిస్తూ మెస్మరైజ్ చేస్తున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. ఈ మధ్యనే రాజరాజ చోరగా ఆకట్టుకున్న శ్రీవిష్ణు మరో సినిమాను..

Bhala Thandanana: యాక్షన్‌లోకి దిగిన శ్రీవిష్ణు.. లుక్ అదిరిందిగా!

Bhala Thandanana

Updated On : December 23, 2021 / 12:54 PM IST

Bhala Thandanana: విభిన్నమైన కథలతో ఒక సినిమా రిలీజ్ అయ్యేలోపు మరో సినిమాను ప్రకటిస్తూ మెస్మరైజ్ చేస్తున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. ఈ మధ్యనే రాజరాజ చోరగా ఆకట్టుకున్న శ్రీవిష్ణు మరో సినిమాను సిద్ధం చేశాడు. అయితే.. ఇప్పటి వరకు భిన్నమైన కథలు.. నేచురాలిటీగా దగ్గరగా ఉండే సబ్జెక్టులతో సినిమాలు చేసిన ఈ యంగ్ హీరో ఈసారి కంప్లీట్ యాక్షన్ మోడ్ లోకి దిగిపోయాడు. భళా తందనానా అంటూ భారీ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.

Radhe Shyam: ప్రభాస్‌తో గొడవ.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పూజా వస్తుందా?

బాణం మూవీ ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం ఓ సినిమా నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తవగా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. తాజాగా ‘భళా తందనాన` ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఇందులో శ్రీవిష్ణు లుక్ తోనే అదరగొట్టాడు. ఇన్ సైడ్ వైట్ టీ షర్ట్, పైన డెనిమ్ షర్ట్, బ్లూ జీన్స్‌తో చేతిలో రెండు తుపాకులు పట్టుకొని ఎంతో కోపంగా ఈ పోస్టర్‌లో కనిపిస్తున్న శ్రీ విష్ణు లుక్ సినిమాపై ఆసక్తి పెంచేస్తోంది.

Amyra Dastur: అందాల అమైరా.. చూస్తే గుండె లయ తప్పాల్సిందే!

భళా తందనాన చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ లకు కొదవే ఉండదని.. అందుకోసం పీటర్‌ హెయిన్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించాడని మేకర్స్ ప్రకటించాడు. ప్రతినాయకుడిగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ రామచంద్ర రాజు రోల్‌ పవర్‌ఫుల్‌ లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించడం మరో విశేషం. మొత్తంగా శ్రీవిష్ణు కెరీర్ లోనే ఇది ప్రతిష్టాత్మక సినిమా కాగా.. మరి శ్రీవిష్ణు యాక్షన్ స్థాయి ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.