Aadikeshava Glimpse : శ్రీలీల బర్త్‌డే స్పెషల్.. వైష్ణవ తేజ్ ‘ఆదికేశవ’ గ్లింప్స్ రిలీజ్.. మీరు చాలా అందంగా ఉన్నారు..

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ తేజ్ నాల్గవ సినిమాగా ఆదికేశవ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తుంది.

Aadikeshava Glimpse : శ్రీలీల బర్త్‌డే స్పెషల్.. వైష్ణవ తేజ్ ‘ఆదికేశవ’ గ్లింప్స్ రిలీజ్.. మీరు చాలా అందంగా ఉన్నారు..

Sreeleela Birthday Glimpse released from vaishnav tej Aadikeshava movie

Updated On : June 14, 2023 / 4:28 PM IST

Sreeleela : ప్రస్తుతం టాలీవుడ్(Tollywood) లో బిజీగా ఉన్న ఒకే ఒక్క హీరోయిన్ శ్రీలీల(Sreeleela). నేడు జూన్ 14 శ్రీలీల పుట్టిన రోజు కావడంతో అభిమానులు, పలువురు ప్రముఖులు, నెటిజన్లు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక శ్రీలీల నటిస్తున్న సినిమాల నుంచి తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్స్. దీంతో ఇవాళ సోషల్ మీడియా అంతా శ్రీలీలే సందడి చేస్తోంది. తాజాగా శ్రీలీల నటిస్తున్న ఆదికేశవ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ తేజ్ నాల్గవ సినిమాగా ఆదికేశవ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళ స్టార్ యాక్టర్ ‘జోజు జార్జ్’ (Joju George) విలన్ కనిపించబోతున్నాడు. తమిళ సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా నేడు శ్రీలీల బర్త్ డే సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రయూనిట్ గ్లింప్స్ రిలీజ్ చేసింది.

VD13 Movie Opening : విజయ్ దేవరకొండ – మృణాల్.. VD13 మూవీ ఓపెనింగ్ పూజా కార్యక్రమం ఫొటోలు..

ఈ గ్లింప్స్ లో శ్రీలీలను చాలా అందంగా చూపించారు. సినిమాలో కూడా శ్రీలీలకి బర్త్ డే శుభాకాంక్షలు చెప్పగా పార్టీకి ఆహ్వానిస్తుంది. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఇది మాస్ కమర్షియల్ సినిమా అయినప్పటికీ లవ్, కామెడీ అంశాలు కూడా చాలానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ గ్లింప్స్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.