Sreeleela : శ్రీలీల బర్త్‌డే.. ఒక్కరోజే ఇన్ని సినిమాల నుంచి ఫస్ట్ లుక్స్.. ఫుల్ ఫామ్ లో ఉందిగా..

యువ హీరోల నుండి స్టార్ హీరోలవరకు అందరి సరసన శ్రీలీల అవకాశాలు సంపాదిస్తుంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఏకంగా 10 సినిమాలు ఉన్నాయి. శ్రీలీల నటిస్తున్న సినిమాల నుంచి తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు.

Sreeleela : శ్రీలీల బర్త్‌డే.. ఒక్కరోజే ఇన్ని సినిమాల నుంచి ఫస్ట్ లుక్స్.. ఫుల్ ఫామ్ లో ఉందిగా..

Sreeleela Birthday Special first looks released by her movies

Updated On : June 14, 2023 / 1:45 PM IST

Sreeleela Birthday :  ప్రస్తుతం టాలీవుడ్(Tollywood) లో బిజీగా ఉన్న ఒకే ఒక్క హీరోయిన్ శ్రీలీల(Sreeleela). కన్నడ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగులో పెళ్లి సందD(Pelli SandaD) సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా మంచి విజయం సాధించడం, కర్ణాటకలో పెరిగినా తెలుగు చక్కగా మాట్లాడుతుండటం, డ్యాన్స్ బాగా చేయడంతో ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి. ఇక ధమాకా సినిమాలో తన యాక్టింగ్, డ్యాన్స్ తో ఒక్కసారిగా తెలుగు స్టేట్స్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించింది శ్రీలీల. దీంతో నిర్మాతలంతా శ్రీలీల తమ సినిమాల్లో ఉండాలని పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తున్నారు.

యువ హీరోల నుండి స్టార్ హీరోలవరకు అందరి సరసన శ్రీలీల అవకాశాలు సంపాదిస్తుంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఏకంగా 10 సినిమాలు ఉన్నాయి. అందులో దాదాపు 8 సినిమాలు అనౌన్స్ చేశారు. అందులో ఆరు సినిమాలు సెట్స్ మీద ఉండి షూటింగ్ జరుపుకుంటున్నాయి. దీంతో అస్సలు ఖాళీ లేకుండా షూటింగ్స్ తో బిజీబిజీగా ఉంది శ్రీలీల. నేడు జూన్ 14 శ్రీలీల పుట్టిన రోజు కావడంతో అభిమానులు, పలువురు ప్రముఖులు, నెటిజన్లు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Vijay Devarakonda : గీతాగోవిందం కాంబో.. రౌడీ హీరో సరసన మృణాల్ ఠాకూర్.. ఓపెనింగ్ పూజా కార్యక్రమం..

శ్రీలీల నటిస్తున్న సినిమాల నుంచి తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. దీంతో ఇవాళ సోషల్ మీడియా అంతా శ్రీలీలే సందడి చేస్తోంది. చిత్రయూనిట్స్ రిలీజ్ చేసిన శ్రీలీల ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇవే..