Neeraja Kona : దర్శకురాలిగా మారుతున్న ఎన్టీఆర్, పవన్‌ల కాస్ట్యూమ్ డిజైనర్‌..

ఎన్టీఆర్ (NTR), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి కాస్ట్యూమ్ డిజైనర్‌ గా చేసిన నీరజ కోన (Neeraja Kona) ఇప్పుడు దర్శకురాలిగా మారబోతుంది. ఒక స్టార్..

Neeraja Kona : దర్శకురాలిగా మారుతున్న ఎన్టీఆర్, పవన్‌ల కాస్ట్యూమ్ డిజైనర్‌..

Star Costume Designer Neeraja Kona directorial debut with P C Sreeram

Updated On : April 8, 2023 / 6:45 AM IST

Neeraja Kona : సినిమా ఇండస్ట్రీలో హీరోలు దర్శకులుగా, దర్శకులు హీరోలుగా.. ఇలా 24 ఫ్రేమ్స్ లో ఒకదాని నుంచి మరొక దానిలోకి షిఫ్ట్ అవ్వడం చూస్తూనే ఉంటాం. తాజాగా ఒక ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్ డైరెక్టర్ బాధ్యతలు తీసుకోబోతుంది. టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ (Kona Venkat) కుటుంబం నుంచి ఇండస్ట్రీకి పరిచమైన టెక్నీషియన్ నీరజ కోన (Neeraja Kona). బాద్‌షా సినిమాలో ఎన్టీఆర్ (NTR) అండ్ కాజల్ అగర్వాల్ కి మొదటిసారి కాస్ట్యూమ్ డిజైనర్ పని చేసి కెరీర్ మొదలు పెట్టింది. ఆ సినిమాలో వారిద్దరి లుక్స్ చాలా స్టైలిష్ గా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నాయి.

Allu Arjun : మెగా హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు అల్లు అర్జున్ ప్రయాణం..

అదే సవత్సరంలో వచ్చిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అత్తారింటికి దారేది సినిమాకి కూడా నీరజ పని చేసింది. ఈ సినిమాలో కూడా తన వర్క్ తో అందర్నీ అక్కట్టుకోవడంతో ఇండస్ట్రీలో ఛాన్సులు ఎదురొచ్చాయి. వరుసగా ఎన్టీఆర్, పవన్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సమంత, కాజల్.. ఇలా స్టార్స్ అందరికి కాస్ట్యూమ్ డిజైన్ చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ డిజైనర్ గా పేరుని సంపాదించుకుంది. అంతేకాదు లిరిక్ రైటర్ గా కూడా తానేంటో నిరూపించుకుంది. థమన్ (S Thaman) దర్శకత్వంలో వచ్చిన తిక్క, చల్ మోహన రంగ, మిస్ ఇండియా సినిమాలో పాటలు రాసి ఆకట్టుకుంది.

Sreeleela : శ్రీలీల ఫస్ట్ సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది తెలుసా.. ఆహాలో శ్రీలీల ఫస్ట్ తెలుగు మూవీ!

ఇక ఇప్పుడు దర్శకురాలిగా కూడా మారబోతుంది. తమిళ స్టార్ సినిమాటోగ్రాఫర్ పి సి శ్రీరామ్ (P C Sreeram) తో కలిసి నీరజ కోన ఈ ప్రాజెక్ట్ చేయబోతుంది. ఈ విషయాన్ని శ్రీరామ్ తన సోషల్ మీడియా ద్వారా స్వయంగా తెలియజేశాడు. యంగ్ రైటర్ మిథున్ చైతన్య ఈ సినిమాకి కథని అందించబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. మరి దర్శకురాలిగా కూడా నీరజ కోన స్టార్ అనిపించుకుంటుందా? లేదా? చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by PC Sreeram Isc (@pcsreeram.isc)