OMG: ఏ సపోర్ట్ లేకుండా గాల్లో ఆసనాలు వేసిన హీరో

  • Published By: veegamteam ,Published On : January 3, 2020 / 05:20 AM IST
OMG: ఏ సపోర్ట్ లేకుండా గాల్లో ఆసనాలు వేసిన హీరో

Updated On : January 3, 2020 / 5:20 AM IST

సుధీర్ బాబు గురువారం (జనవరి 2, 2020)న త‌న ట్విట్ట‌ర్‌ లో ఎలాంటి సపోర్ట్ లేకుండా గాల్లో ఆస‌నాలు వేసిన ఫోటోలు షేర్ చేశాడు. ఈ ఫోటోల‌కి ఇందులో ఫోటోషాప్ ఇన్వాల్వ్‌మెంట్ లేదు. న‌న్ను న‌మ్మండి అని కామెంట్ పెట్టాడు. కానీ నెటిజన్లు మాత్రం అస్సలు నమ్మట్లేదు. అలా ఎలా సాధ్యం అవుతోంది అని రిప్లే ఇస్తున్నారు. మరి కొంతమంది ఏమో సుధీర్ బాబు కాస్త.. సుధీర్ బాబా అయ్యాడంటూ జోక్స్ వేస్తున్నారు.

ఏదేమైన గాల్లో సుధీర్ బాబు కాళ్ళు ముడిచి చేతుల‌తో దండం పెడుతున్న‌ ఆసనం ఆశ్చంగానే ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే సుధీర్ ప్ర‌స్తుతం ఇంద్ర‌గంటి మోహ‌నకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ‘వి’ అనే సినిమా చేస్తున్నాడు. 

ఇందులో నాని ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అదితి రావు హైద‌రి, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాకి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది చివ‌ర‌లో మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ఆలోచ‌న‌లో ఉన్నట్లు మూవీ మేక‌ర్స్ ప్రకటించారు.